Black Rice: ప్రస్తుతం మనుషులను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మన దేశంలోని ప్రజలకు బియ్యం ప్రధాన ఆహారం కాగా బియ్యంలో ఎన్నో రకాలు ఉన్నాయి. దేశంలో నల్ల బియాన్ని చాలా తక్కువమంది సాగు చేస్తున్నారు. పూర్వం రాజులు మాత్రమే ఈ నల్ల బియ్యంతో చేసిన అన్నంను తినేవారని చరిత్ర చెబుతోంది. ఇతర బియ్యాలతో పోలిస్తే ఆరోగ్యానికి నల్లబియ్యం ఎంతో మేలు చేస్తుండగా కిలో నల్ల బియ్యం 200 రూపాయలుగా ఉంది.

శాఖాహారులు నల్లబియ్యం తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. రక్తపోటు సమస్యతో బాధ పడేవాళ్లు ప్రత్యామ్నాయంగా ఈ నల్లబియ్యంను తినవచ్చు. నల్లబియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో ఎంతగానో సహాయపడుతుంది. నల్లబియ్యం హృదయ సంబంధిత సమస్యలతో పాటు మెదడు సంబంధిత సమస్యలకు సులభంగా చెక్ పెడుతుంది.
శరీరంలోని అనవసర కొవ్వును కరిగించడంలో నల్లబియ్యం తోడ్పడుతుంది. నల్లబియ్యంను ఆహారంలో భాగం చేసుకుంటే హృదయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నల్ల ధాన్యాలు రుచిని కలిగి ఉండటంతో పాటు తీపి వంటలను తయారు చేయడానికి నల్లబియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. నల్ల బియ్యంలో ఉండే ఫైబర్ మధుమేహంకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది.
Also Read: Food For Childrens: పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టకండి..?
నల్లబియ్యంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడటంలో ఉపయోగపడతాయి. నల్లబియ్యంలో ఉండే ఆంథోసైనిక్స్ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు శరీరంలో హానికర బ్యాక్టీరియా వైరస్ చేరే ఛాన్స్ ఉండదు. నల్లబియ్యంలో శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి.
Also Read: Children’s food: పిల్లలకు ఈ ఆహారం తినిపిస్తే ప్రమాదం అట.. జాగ్రత్త