https://oktelugu.com/

Pushpa Movie: “పుష్ప” సినిమా నాలుగు సినిమాల కష్టం అంటున్న: అల్లు అర్జున్

Pushpa Movie: అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప – ది రైజ్’ సినిమాకు హైప్ మామూలుగా లేదని చెప్పాలి. ఈ సినిమాతో పాటు వస్తున్న పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే ‘పుష్ప’ ప్రమోషన్స్ కొంచెన్ తగ్గినట్టున్నాయి. కానీ ఈ మూవీ పై ప్రేక్షకులకు మాత్రం భారీ అంచానలే ఉన్నాయి. ఈ మేరకు నిన్న పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలువురు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 09:45 AM IST
    Follow us on

    Pushpa Movie: అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప – ది రైజ్’ సినిమాకు హైప్ మామూలుగా లేదని చెప్పాలి. ఈ సినిమాతో పాటు వస్తున్న పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే ‘పుష్ప’ ప్రమోషన్స్ కొంచెన్ తగ్గినట్టున్నాయి. కానీ ఈ మూవీ పై ప్రేక్షకులకు మాత్రం భారీ అంచానలే ఉన్నాయి. ఈ మేరకు నిన్న పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలువురు టాలీవుడ్ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ చీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. అలానే దర్శకులు మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా ఈ ఈవెంట్ కు దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ పలు కారణాల రీత్యా హాజరు కాలేకపోయారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Pushpa Movie

    ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ… ‘అందరికీ ఫ్యాన్స్‌ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంది. అభిమానులు నా ఆర్మీ. నేను నా జీవితంలో సంపాదించుకుంది ఏదైనా ఉంటే మీరే(అభిమానులు). మీకన్నా ఏదీ ఎక్కువ కాదు. దేవిశ్రీ ప్రసాద్‌ ఎప్పటినుంచో జర్నీ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలు ఇచ్చాడు.’ ‘దేవిశ్రీ, నేను, సుక్కుగారు కలిసి ప్రయాణం మొదలు పెట్టాం. నాకోసం చక్కని ఆల్బమ్‌ ఇచ్చావు. ఇప్పుడు కూడా బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కోసం కష్టపడుతున్నాడు. చంద్రబోస్‌ ప్రతి పాటనూ అద్భుతంగా రాశారు. సినిమాటోగ్రాఫర్‌ కూబా, ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, మౌనిక ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.’ ‘ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాల కష్టం. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేషనల్ క్రష్ అయిన రష్మికను ముద్దుగా క్రష్మిక అని పిలుస్తా. మనం చాలా మందితో కలిసి పనిచేస్తాం. మన మనసుకు నచ్చేవారు కొందరే. అలాంటి అమ్మాయే రష్మిక. చాలా టాలెంట్‌ ఉన్న అమ్మాయి, చక్కని నటి. ఐటమ్‌ సాంగ్‌ చేసినందుకు సమంత ధన్యవాదాలు.

    Also Read: Rajinikanth: ర‌జినీకాంత్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

    సునీల్‌ను ఇప్పటివరకూ ఒక రకంగా చూశాం. మంగళం శీనుగా కొత్త సునీల్‌ను చూస్తారు. కొండారెడ్డిగా అజయ్‌ ఘోష్‌, దాక్షాయణిగా అనసూయ, రావు రమేశ్‌, ధనుంజయ చాలా చక్కగా నటించారు. భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ నటన వేరే లెవల్‌. ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది.’ ‘ఈ ఫంక్షన్‌కు సుకుమార్‌ రాలేదని చెప్పగానే నాకేమీ అర్థం కాలేదు. ఆయనని కన్విన్స్ చేద్దామని నేను ఫోన్‌లో మాట్లాడితే సుక్కు నన్ను కన్విన్స్‌ చేశారు. నువ్వు వేరు, నేను వేరు, కాదు మనం ఒక్కటే అని సుకుమార్‌ అన్నారు. నిజంగా ఆయన పడుతున్న కష్టానికి హ్యాట్సాఫ్‌’ అని అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చారు.

    Also Read: Akhanda: బాలయ్య బాబు చాలా జెన్యూన్… చూసి నేర్చుకోండయ్యా!