https://oktelugu.com/

scholarships: పది, ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త.. రూ.20,000 స్కాలర్ షిప్!

scholarships: కోల్గేట్‌ పామోలివ్‌ ఇండియా లిమిటెడ్‌ కీప్‌ ఇండియా స్మయిలింగ్‌ ఫౌండేషనల్‌ పది, ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఈ సంస్థ ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుండటం గమనార్హం. 5 లక్షల రూపాయల లోపు కుటుంబ ఆదాయం ఉంటే మాత్రమే ఈ స్కాలర్ షిప్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పదో తరగతిలో 75 శాతం మార్కులు సాధించి ఇంటర్ చదువుతున్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 30, 2021 5:03 pm
    Follow us on

    scholarships: కోల్గేట్‌ పామోలివ్‌ ఇండియా లిమిటెడ్‌ కీప్‌ ఇండియా స్మయిలింగ్‌ ఫౌండేషనల్‌ పది, ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఈ సంస్థ ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుండటం గమనార్హం. 5 లక్షల రూపాయల లోపు కుటుంబ ఆదాయం ఉంటే మాత్రమే ఈ స్కాలర్ షిప్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    scholarships

    scholarships

    పదో తరగతిలో 75 శాతం మార్కులు సాధించి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున రెండు సంవత్సరాల పాటు స్కాలర్ షిప్ ను పొందవచ్చు. ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసై ప్రస్తుతం డిగ్రీ, డిప్లొమా చదువుతున్న వాళ్లు సైతం స్కాలర్ షిప్ ను పొందవచ్చు. డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు మూడు సంవత్సరాల పాటు 30,000 రూపాయల స్కాలర్ షిప్ పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

    ప్రముఖ క్రీడా సంస్థ, ఫెడరేషన్‌, అకాడమీ, కోచ్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొంది 9 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా 100 లోపు, దేశవ్యాప్తంగా 500 లోపు ర్యాంక్ సాధిస్తే ఏడాదికి రూ.75,000 చొప్పున మూడు సంవత్సరాల పాటు స్కాలర్ షిప్ పొందవచ్చు. ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులు సాధించిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

    https://colgatecares.co.in/keepindiasmiling/index.html వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేద పిల్లలకు చదువు చెప్పడం, క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఏడాదికి 75,000 రూపాయలు ఫౌండేషనల్‌ గ్రాంట్‌ గా పొందే ఛాన్స్ ఉంటుంది.

    Also Read: పేద ప్రజల కోసం ఎల్‌ఐసీ పాలసీ.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆదాయం!