J D Lakshminarayana : వైఎస్ జగన్ ను అక్రమాస్తుల కేసులో జైలుకు పంపిన స్టిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ. సీబీఐ జేడీగా చేసిన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన లక్ష్మీనారాయణ అప్పుడు విశాఖ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ ను ప్రశ్నించి పార్టీ నుంచి వైదొలిగాడు.
జనసేన వైదొలిగాక జనాలను కలుస్తూ సంఘాలను ఏకం చేస్తూ ప్రసంగాలతో కాలం గడుపుతున్న జేడీ లక్ష్మీనారాయణ తాజాగా తన రాజకీయ గమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తనకు రెండు పార్టీల నుంచి ఆఫర్ ఉందని హాట్ కామెంట్స్ చేశారు. తనకు వైసీపీ నుంచి ఆఫర్ ఉందని.. బీజేపీ వైపు నుంచి కూడా పిలుపు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఉద్యమం చేసిన జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు.
Also Read: పవన్ ఆవేశానికి పెద్దల సంకెళ్లు… కారణం అదేనా?
ఇక జగన్ ను జైలుకు పంపిన అధికారిగా వైసీపీలో జేడీ లక్ష్మీనారాయణ చేరే అవకాశాలు లేవు. వైసీపీ నేతలు జేడీని ఆహ్వానించే అవకాశాలు కనిపించడం లేదు. ఇక బీజేపీకి ఏపీలో బలం లేదు. ఆ పార్టీలో జేడీ చేరే చాన్స్ లేదు.
ప్రస్తుతానికి జేడీకి ఉన్న ఒకే ఒక్క చాన్స్ కేవలం జనసేన మాత్రమే. ఆ పార్టీలోకి తిరిగి వెళ్లడమే జేడీకి మిగిలి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో జేడీ ట్విస్ట్ ఇచ్చాడు. పవన్ పిలిస్తే తాను జనసేనలో చేరే విషయం ఆలోచిస్తాను అటూ జేడీ అనడం ఆసక్తి రేపుతోంది. అంటే జేడీ మనసు మార్చుకొని తిరిగి జనసేనవైపు చూస్తున్నాడు. మరి ఒకసారి కాలదన్నిన జేడీని పవన్ చేర్చుకుంటారా? లేదా? అన్నది డౌటు..?
Also Read: భీమ్లా నాయక్ సినిమా నుంచి గుడ్ న్యూస్… నాలుగవ పాట విడుదల ఎప్పుడంటే ?