
Chicken Price: కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి వారికి కచ్చితంగా రోజు వారి భోజనంలో చికెనో, మటనో కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ప్రతీ రోజూ కాకుండా వారంలో ఒకటో, రెండో సార్లు నాన్‌వెజ్ తినేవాళ్లు ఎక్కువగా ఉంటారు. పార్టీల్లో, పంక్షన్‌లలో మాంసాన్ని ప్రధాన పాత్ర. ప్రస్తుతం నాన్‌వెజ్ పెట్టని ఫంక్షన్లను అసలు ఫంక్షన్లుగానే పరిగణిస్తలేరు. అయితే మాంసం ధరలు అధికంగా ఉండటం వల్ల వీటి వినియోగం గత నాలుగైదు నెలల నుంచి కాస్త తగ్గింది. అయితే ఇప్పుడు మాంసం ప్రియులకు మంచి రోజులు వచ్చాయి. చికెన్ ధరలు చాలా పడిపోయాయి. ఈ ఏడాదిలో ఇప్పుడున్న ధరలే అత్యల్పం..
కారణాలేంటి ?
కరోనా ఫస్ట్ వేవ్‌లో సమయంలో మొదట్లో చికెన్ వినియోగంపై అనేక అపోహలు చెలరేగాయి. దీంతో వాటి ధరలు అమాంతం పడిపోయాయి. చాలా చోట్ల కిలో 50 నుంచి 80 మధ్యలో విక్రయించారు. కొన్ని చోట్ల కోళ్ల ఫాం నిర్వహణకు కూడా ఖర్చులు మిగిలకపోవడంతో ఫ్రీగా కూడా ఇచ్చేశారు. అప్పట్లో ఈ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. తరువాత సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ తరువాత పరిస్థితి మారింది. చికెన్ తింటే రోగనిరోదక శక్తి పెరుగుతుందని, కరోనా నుంచి తట్టుకోవాలంటే మాంసం తినాలని సూచించారు. దీంతో వాటి ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అప్పటి నుంచి వాటి ధరల్లో పెద్దగా తరుగుదల కనిపించడం లేదు.
ఈ ఏడాది మార్చిలో మళ్లీ రెండో వేవ్ రావడంతో చికెన్ వినియోగం కూడా పెరిగింది. ఇక అప్పటి నుంచి చికెన్ ధరలు స్థిరంగా ఉంటూ వస్తూన్నాయి. అయితే ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. దీంతో చికెన్ వినియోగం చాలా వరకు తగ్గింది. ఈ నెల మొదటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డిమాండ్ లేకపోవడంతో చికెన్ ధరలు కూడా ఆటోమెటిక్ గా తగ్గిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ధర రూ. 170 నుంచి 180 వరకు పలుకుతోంది. ఈ ఏడాది ఇంతలా ధర పడిపోవడం ఇదే మొదటి సారి. ఇంకా కొంత ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక సారి ఫామ్‌లో కోళ్లు పెంపకం స్టార్ట్ చేశారంటే.. దానిని కొన్ని రోజుల పాటు పెంచి అమ్మేస్తుంటారు. దాదాపు 60 – 80 రోజుల పాటు కోళ్లను పెంచుతారు. తరువాత వాటిని అమ్మేస్తారు. మార్కెట్ లో ధర ఉన్నా.. ఉండకపోయినా ఆ సమయంలో వాటిని కచ్చితంగా అమ్మేయాల్సిందే. లేకపోతే వాటి దాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతాయి. వాధ్యులు బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్‌లోకి కోళ్లు విరివిగా వస్తున్నాయి. డిమాండ్ లేని కారణంగా వాటి ధరలు కూడా పడిపోయాయి. కార్తీక మాసం ముగిసినా కూడా కొన్ని రోజుల ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఇది చికెన్ వినియోగదారులకు ఒక గ్యూడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
Also Read: ఆరోగ్యానికి ఏ నెయ్యి మంచిదో తెలుసా.. పసుపు నెయ్యి, తెలుపు నెయ్యి మధ్య తేడాలివే?
టీ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదేనా.. నిపుణులు ఏం చెప్తున్నారు?