https://oktelugu.com/

lIGER: విజయ్​ దేవరకొండ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆ స్టార్​ హీరో ఎవరో తెలుసా?

lIGER: పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అర్జున్​ రెడ్డి సినిమాతో సెన్​షేషన్​ సృష్టించిన హీరో విజయ్​ దేవరకొండ.. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకపోయినా.. స్వతహాగా కష్టపడి అతి తక్కువ కాలంలోనే స్టార్​ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్​. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్​ పూరిజగన్నాథ్​ విజయ్​ హీరోగా ఓ సినిమా తరకెక్కుతోంది. ఈ సినిమాకు లైగర్​ అనే టైటిల్​ ప్రకటించారు. ఇందులో బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమాతో విజయ్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 14, 2021 / 11:20 AM IST
    Follow us on

    lIGER: పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అర్జున్​ రెడ్డి సినిమాతో సెన్​షేషన్​ సృష్టించిన హీరో విజయ్​ దేవరకొండ.. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకపోయినా.. స్వతహాగా కష్టపడి అతి తక్కువ కాలంలోనే స్టార్​ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్​. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్​ పూరిజగన్నాథ్​ విజయ్​ హీరోగా ఓ సినిమా తరకెక్కుతోంది. ఈ సినిమాకు లైగర్​ అనే టైటిల్​ ప్రకటించారు. ఇందులో బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్​గా నటిస్తోంది.

    ఈ సినిమాతో విజయ్​ బాలీవుడ్​కు.. టాలీవుడ్​కు అనన్య పాండే ఒకేసారి పరిచయం కబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ సినిమా నుంచి అప్​డేట్స్​ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం అభిమానులతో పాటు, మరో స్టార్​ హీరో కూాడా ఎదురుచూస్తున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. మలయాళ స్టార్​ హీరో దుల్కర్​ సల్మాన్​. ఓకే బంగారం, మహానటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడు కురుప్​ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించి మంచి హిట్​ కొట్టాడు. మరోవైపు ఈ సినిమాతో పాటు, ఆనంద్​ దేవరకొండ నటించిన పుష్పక విమానం కూడా విడుదలైంది.

    ఈ క్రమంలోనే పుష్పక విమానం సినిమా సక్సెస్​ కావాలని దుల్కర్​ సోషల్​ మీడియా వేదికగా తెలిపారు. ఈ ట్వీట్​పై స్పందించిన విజయ్​.. దుల్కర్​ను ఓ సోదరుడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, తాను లైగర్​ షూటింగ్​లో ఉన్నట్లు చెప్పగా.. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు దుల్కర్​ తెలిపారు. ప్రస్తుతం కురుప్​ సినిమా మంచి టాక్​ వినిపిస్తోంది. మొదటి రోజు నుంటే పాజిటివ్​ టాక్​తో దూసుకెళ్తోంది.