Gold Price: పిసిరంత పసిడి దక్కించుకోవాలని మహిళలు ఆరాటపడుతూ ఉంటారు. మిగతా వాటికంటే గోల్డ్ కు డిమాండ్ ఉండడంతో దీని ధర పైకి పోతుంది. మొన్నటి వరకు 12 గ్రాముల బంగారం 60 వేలకు పైగానే పలికింది. ప్రస్తుతం శ్రావణ మాసం సందర్భంగా పెళ్లిళ్ల జోరుతో అమ్మకాలు ఊపందుకుంది. ఈ నేపథ్యంలో బంగారం ధర పెరుగుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ అంచనాలకు భిన్నంగా గత మూడు రోజులుగా పతనం అవుతూ వస్తోంది. మూడు రోజుల్లో బంగారం ధర రూ.500 వరకు తగ్గడం విశేషం. సాధారణంగా డిమాండ్ ఉన్న సమయంలో దీని ధర పెరుగుతంది. కానీ ఈ సమయంలో ధర తక్కువ కావడం బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం పసిని ఏ రేటు పలుకుతుందో చూద్దాం.
వరల్డ్ వైడ్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ డిక్రీజ్ అవుతున్నాయి. అంతర్జాతీయస్థాయిలో బంగారం ధర ఔన్స్ కు 1925 డాలర్లు పలుకుతోంది. ఇదే సమయంలో వెండి ఔన్స్ కు 23.07 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే మనదేశంలోని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ప్రస్తుతం రూ.55,050 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారానికి రూ.60,040 పలుకుతోంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,900 గా విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల గోల్డ్ ను రూ.59,890తో అమ్ముతున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో సిల్వర్ కిలో రూ.77,500 వేలతో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో రూ.77,500 పలుకుతోంది. మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో మూడురోజుల్లో గోల్డ్ కు రూ.430 వరకు తగ్గింది. ఢిల్లీలో సిల్వర్ వరుసగా ఆరో రోజుల పాటు పతమవుతూ వస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ఏకంగా రూ.3,600 పడిపోయింది. ప్రస్తుతం రూ.74 వేలతో విక్రయిస్తున్నారు.
సాధారణంగా శ్రావణ మాసంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉంటాయి. ఈ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండడం వల్ల బంగారం కొనుగోలుపై వినియోగదారులు ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన మార్పుల కారణంగా బంగారం ధరలు తగ్గాయి. అయితే ధర తగ్గిన విషయం తెలియగానే చాలా మంది కొనుగోలు దారులు బంగారం కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.