Cooking oils: దేశంలో గత కొన్ని నెలలుగా వంటనూనెల ధరలు అంతకంతకూ పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై భారం మరింత పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయంగా మాత్రం వంటనూనెల ధరలు భారీ మొత్తంలో తగ్గడం గమనార్హం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు పండుగ సమయంలో కేంద్రం వంటనూనెల విషయంలో తీపికబురు అందించింది.

కేంద్ర ప్రభుత్వం సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాటు సోయాబీన్, ముడి పామాయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తొలగించడం గమనార్హం. ఈ సుంకంతో పాటు అగ్రిసెస్ ను కూడా తొలగించడంతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వంటనూనెలపై సైతం కేంద్రం పన్నును తగ్గించడం గమనార్హం. వంటనూనెల హోల్ సేల్, రిటైల్ ధరలు తగ్గడంతో హోటల్, రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్న వాళ్లకు సైతం ప్రయోజనం చేకూరనుంది.
కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్ పై అగ్రి సెస్ ను 7.5 శాతానికి, ముడి పొద్దుతిరుగుడు నూనెపై అగ్రిసెస్ ను 5.5 శాతానికి తగ్గించగా రిఫైన్డ్ వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకం 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గింది. మన దేశానికి సన్ ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ దిగుమతి అవుతుండగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది.
Also Read: LPG Gas Cylinder: రూ.634కే కొత్త గ్యాస్ సిలిండర్ పొందే ఛాన్స్.. ఏం చేయాలంటే?
వంటనూనె ధరల తగ్గుముఖం దిశగా అడుగులు పడటంపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు వంటనూనె ధరల తగ్గుదలతో ఉపశమనం లభించిందని చెప్పాలి.