BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 88 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం బెల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

బీఈ, బీటెక్ అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. http://bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 88 ఉద్యోగ ఖాళీలు ఉండగా ట్రెయినీ ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీలు 55, ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీలు 33 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం.
2021 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నాటికి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ట్రెయినీ ఇంజనీర్లు, 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ లో వచ్చిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Huzurabad and Badvel: బద్వేలు, హుజూరాబాద్ బరిలో ఎంతమందంటే?
2021 సంవత్సరం అక్టోబర్ 27వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
Also Read: Billion Cheers Jersey : ప్రపంచ టీ20 కప్ లో టీమిండియా కొత్త జెర్సీ ఇదే