https://oktelugu.com/

Tulasi: తులసి చెట్టుతో ఈ చెట్లను పెంచితే అదృష్టం

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటుతుంటారు. ఈ మొక్కలు వాస్తుతో పాటు సమస్యలను కూడా తీర్చుతాయి అని నమ్ముతారు. తులసి కూడా ఇలాంటి మొక్కనే అంటారు జ్యోతిష్యులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 3, 2024 3:42 pm
    Tulasi

    Tulasi

    Follow us on

    Tulasi: ఇంటి ముందు చిన్న గార్డెన్ పెట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సరైన వసతి లేకపోతే మాత్రమే ఆలోచిస్తారు. మరొక విషయం ఒక చిన్న గార్డెన్ కోసం పట్నంలో చెట్లు కొనాలి అంటే ఆస్తులు అమ్ముకోవాలి అనేట్టుగా ఉన్నాయి రేట్లు. అయితే ఏ ఇంట్లో అయినా తులసి చెట్టు మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ చెట్టుతో పాటు మరొక చెట్టు ఉంటే మీ ఇంట్లో అదృష్టం తాండవిస్తుంది. ఇంతకీ ఆ చెట్లు ఏంటి అనుకుంటున్నారా?

    వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటుతుంటారు. ఈ మొక్కలు వాస్తుతో పాటు సమస్యలను కూడా తీర్చుతాయి అని నమ్ముతారు. తులసి కూడా ఇలాంటి మొక్కనే అంటారు జ్యోతిష్యులు. తులసిని దేవతగా భావించి పూజిస్తారు కూడా. ఈ తులసి మొక్క మాత్రమే కాదు ఈ మొక్కతో మరో రెండు మొక్కలను నాటితే జీవితంలో చాలా ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు పండితులు. శివుడిని పూజించేటప్పుడు ఉమ్మెత్త పూలను ఉపయోగిస్తారు కొందరు. ఈ పువ్వుకు హిందూమతంలో ప్రత్యేకమైన స్థానం ఉందని నమ్ముతారు.

    స్వయంగా శివుడు ఈ పువ్వులో నివసిస్తాడని అంటారు. దీంతో తులసి మొక్కతో పాటు ఈ నల్ల దాతురా మొక్కను నాటడం వల్ల వివాహ బంధంలో ఎలాంటి గొడవలు సంభవించవు అని.. ఆ బంధం బలపడుతుందని ప్రతీక. జిల్లేడు పూలు శివునికి అంకింత చేసిన పూలలో ముఖ్యమైన పువ్వు అంటారు పండితులు. ఈ మొక్కకు కూడా హిందూ సంప్రదాయంలో పవిత్రమైన స్థానం ఉంది. ఇంట్లో తులసి చెట్టుతో ఈ మొక్కను కూడా నాటితే సంపదను కాపాడుతుందనే విశ్వాసం కలదు. పెరట్లో నాటితో కోట్ల లాభాలు అంటారు.

    పితృ దోషం ఉంటే ఈ మొక్కలను ఇంట్లో నాటాలట. పితృదోషానికి ఈ మొక్కలు గొప్ప ఔషధం గా పరిగణిస్తారు. ఇక ఉమ్మెత్త మొక్కకు రోజు ఉదయం తలస్నానం చేసి నీళ్లలో కొన్ని పాలు పోసి చెట్టుకు పోయాలట. దీని వల్ల పితృ దోషం తొలిగిపోతుందట.

    ఈ కథనం ప్రజల విశ్వాసాలు, సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మాత్రమే అందించాము. ఈ సమాచారాన్ని ఓకే తెలుగు ధృవీకరించలేదు. కచ్చితంగా వాస్తవం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.