NTR Car: కొత్త కారు కొన్న జూ. ఎన్టీఆర్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఎన్టీఆర్ కార్లు కొన్ని కోట్ల ఖరీదు చేస్తాయి. ఇప్పటికే ఎన్నో కార్లు ఉండగా ఇప్పుడు కొత్త కారు వచ్చి చేరింది. రీసెంట్ గా తారక్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కు వచ్చారట.

Written By: Swathi, Updated On : April 3, 2024 3:49 pm

NTR Car

Follow us on

NTR Car: సెలబ్రెటీలకు కొన్ని వస్తువుల మీద ఇష్టం ఉంటుంది. ఒకరికి వాచ్, మరొకరికి స్పెడ్స్, ఇంకొరికి ట్రిప్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. అయితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఏదంటే ఇష్టమో తెలుసా? అదేనండి కార్లు అంటే పరమ ప్రీతి అని టాక్. ఇప్పుడు ఈ స్టార్ హీరో గ్యారేజ్ లోకి మరొక కొత్త కారు కూడా వచ్చి చేరిందట. ఆ కారు ఏంటి? దాని కాస్ట్ ఎంత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్యాన్స్ రెడీనా..

ఎన్టీఆర్ కార్లు కొన్ని కోట్ల ఖరీదు చేస్తాయి. ఇప్పటికే ఎన్నో కార్లు ఉండగా ఇప్పుడు కొత్త కారు వచ్చి చేరింది. రీసెంట్ గా తారక్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కు వచ్చారట. ఆ ఆపీస్ నుంచి బయటకు వస్తున్న ఫోటోలు వైరల్ కాగా ఎన్టీఆర్ కొత్త కారు తీసుకున్న విషయం తెలిసిందట. ఆ కారు రిజిస్ట్రేషన్ కోసమే వచ్చారట తారక్. బ్లాక్ టీ షర్ట్ బ్లూ జీన్స్ ప్యాంట్ లో బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి సింపుల్ హెయిర్ స్టైల్ తో చాలా సింపుల్ గా కానీ హాండ్ సమ్ గా కనిపించారు ఆర్టీవో ఆఫీస్ లో ఎన్టీఆర్.

ఈ పిక్స్ చూసిన ఆయన అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది ఇంతకీ మా ఎన్టీఆర్ అన్న కొన్న కారు ఏంటి అనుకుంటున్నారా?మెస్సిడేస్ బెంజ్ మే బాచ్ ఎస్ క్లాసిక్ యస్ 580 అంట. ఈ లగ్జరీ కారును ఎన్టీఆర్ చాలా ఇష్టంతో కొన్నారట. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఏకంగా ఈ కారు దాదాపు రూ. 3 కోట్లకు పైగానే ఉంటుంది. అడ్వాన్స్డ్ లగ్జరీ ఫీచర్స్ తో ఈ కారును తయారు చేశారట. ఎమర్జెన్సీ సమయంలో ఈకారులో ఆటోమెటిక్ గా అలారం కూడా వస్తుందట.

కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు జూ. ఎన్టీఆర్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ బిజీలో ఉన్నారు తారక్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమాతో బిజీ అవుతారని టాక్. ఈ సినిమాలే కాదు మరిన్ని సినిమాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయట.