https://oktelugu.com/

Periods: పీరియడ్స్ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు..

నీరు తక్కువ తీసుకోవడం.. పీరియడ్స్ లో కలిగే ఇబ్బంది వల్ల చాలా మంది మహిళలు నీరు తాగడం మర్చిపోతుంటారు. యూరిన్ కు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుందని మరింత భయపడతారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 3, 2024 / 03:27 PM IST

    Periods

    Follow us on

    Periods: కొన్ని విషయాల పట్ల పెద్దలు చాలా జాగ్రత్తలు చెబుతుంటారు. కానీ మీకేం తెలుసే ముసలొల్లు అని కొట్టిపారేస్తారు ఈ కాలం జనరేషన్ అమ్మాయిలు. అయితే పీరియడ్స్ సమయంలో కూడా కొన్ని విషయాలను చెబుతారు. కానీ వింటేగా.. అయితే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి ఇబ్బంది పెడతాయి. మానసికంగా కూడా ఈ సమయంలో కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. కానీ తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. మరీ ఈ పీరియడ్స్ సమయంలో చేయకూడని తప్పులు ఏంటో చూసేద్దామా?

    వాక్సింగ్.. పీరియడ్స్ సమయంలో వాక్సింగ్ చేయకూడదు. దీనివల్ల సున్నితత్వం, నొప్పి మరింత పెరుగుతుంది. రుతుస్రావం సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు స్కిన్ ను సున్నితంగా చేస్తాయి. వాక్సింగ్ సెషన్ లలో అసౌకర్యాన్ని పెంచుతాయి. అసౌకర్యం తగ్గడానికి పీరియడ్స్ కు ముందు, తర్వాత వ్యాక్సింగ్ చేయించుకోవడం మంచిది.

    నీరు తక్కువ తీసుకోవడం.. పీరియడ్స్ లో కలిగే ఇబ్బంది వల్ల చాలా మంది మహిళలు నీరు తాగడం మర్చిపోతుంటారు. యూరిన్ కు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుందని మరింత భయపడతారు. కానీ ఈ సమయంలోనే మంచినీరు ఎక్కువ తీసుకోవాలి. హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల కడుపు ఉబ్బరం, తిమ్మిరి, తలనొప్పి వంటి సమస్యలు రావు.

    పెయిన్ తగ్గించే మందులు.. పీరియడ్స్ లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ మాత్రం వాడకూడదు అంటారు నిపుణులు. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. ఇబుప్రోఫెన్ వంటి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ మితిమీరిన వినియోగం వల్ల జీర్ణ సమస్యలు, ఇతర సమస్యలు వస్తాయట. మందుల మీద ఆధారపడకుండా రుతుక్రమ అసౌకర్యాన్ని తగ్గించే హీట్ థెరపీ సున్నితమైన వ్యాయామం వంటివి చేయాలి.

    నిద్ర.. పీరియడ్స్ సమయంలో మంచి నిద్ర చాలా అవసరం. కానీ కొందరు పెయిన్ వల్ల, బ్లీడింగ్ వల్ల ఎక్కువగా నిద్రకు దూరం అవుతుంటారు. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. పీరియడ్స్ పెయిన్ మరింత పెరుగుతుంది. అలసట, తిమ్మిర్లు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమయంలో 8 నుంచి 9 గంటలు నిద్ర పోవాల్సిందే.

    షుగర్ ఫుడ్స్, కెఫిన్.. ఈ సమయంలో కాఫీలు, షుగర్ ఫుడ్స్ తినకూడదు. పీరియడ్స్ సమయంలో ఈ పదార్థాలు తినాలి అనిపిస్తుంది కానీ మితంగా తినాలి. హెర్బల్ టీలు, డార్క్ చాక్లెట్, ఆరోగ్యకరమైన పండ్లతో కోరికలు తీర్చుకుంటే సరిపోతుంది అంటున్నారు నిపుణులు.