https://oktelugu.com/

Good Habits: లైఫ్‌లో ఈ అలవాట్లు దూరం చేసుకుంటే.. మీరే హీరో

కొందరు కోరి సమస్యలను క్రియేట్ చేసుకుని అందరి ముందు మాటలు పడతారు. ఇలా ఎవరి ముందు కూడా మీరు చులకన కాకుండా ఉండాలంటే మాత్రం లైఫ్‌లో తప్పకుండా కొన్ని అలవాట్లను వదిలేయాలి. మరి లైఫ్‌లో మీరు దూరం చేయాల్సిన ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2024 / 04:31 AM IST

    success

    Follow us on

    Good Habits: జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్లాలంటే తప్పకుండా ఉండాలి. కొన్ని అలవాట్లను లైఫ్‌ నుంచి దూరం చేసుకుంటేనే ప్రతీ ఒక్కరికి మంచిది. మీ లైఫ్‌కి మీరే హీరో కావాలంటే కొన్ని అలవాట్లను వదిలేయాలి. లైఫ్‌లో ఏదైనా సాధించాలని కసి ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. ఈ క్రమంలో కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. అందరి ముందు మీరు హీరోగా ఉండాలంటే కొన్ని విషయాల్లో అసలు తగ్గకూడదు. కొందరు కోరి సమస్యలను క్రియేట్ చేసుకుని అందరి ముందు మాటలు పడతారు. ఇలా ఎవరి ముందు కూడా మీరు చులకన కాకుండా ఉండాలంటే మాత్రం లైఫ్‌లో తప్పకుండా కొన్ని అలవాట్లను వదిలేయాలి. మరి లైఫ్‌లో మీరు దూరం చేయాల్సిన ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    అందరి దగ్గర చేయి చాచడం
    కొందరు కష్టపడి జీవించకుండా ఇతరుల మీద ఆధారపడతారు. ఇలా ఇతరులపై డిపెండ్ కావడం వల్ల వారు మిమ్మల్ని చులకనగా చూస్తారు. ఎవరి కష్టం తీసుకోకుండా, ఇతరులను డబ్బులు అడగకుండా కేవలం మీ కష్టం మీద మాత్రమే జీవించండి. దీనివల్ల మీకు గౌరవం అన్ని లభిస్తాయి. కొందరు ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని తింటారు. అవసరాలకు తల్లిదండ్రులను డబ్బులు అడుగుతారు. ఇలా ఇతరుల దగ్గర కూడా అడగటం వల్ల మీ పరువే పోతుంది. కాబట్టి ఎవరి దగ్గర రూపాయి చేయి చాచకుండా మీ కష్టంతో జీవించండి.

    పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడటం
    ప్రతీ ఒక్కరికీ జీవితంలో పాత జ్ఞాపకాలు ఉంటాయి. వీటిని ఎంత తొందరగా మరిచిపోతేనే అంత మంచిది. ఇలా పాత జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుని బాధ పడటం వల్ల మీకే నష్టం. అయిపోయిన వాటి గురించి ఏం చేయలేం. కాబట్టి పాతవి వదిలేసి.. ప్రస్తుతం సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోండి.

    మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోవడం
    కొందరికి వాళ్ల మీద కంటే ఇతరుల మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది. దీంతో దేనికి పనికి రామని వాళ్లకు వాళ్లే అనుకుని నిరాశ చెందుతారు. మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఇంకా ఇతరులు ఏం నమ్ముతారు. ఇలా మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుని మాట్లాడవద్దు. ముందు మీ మీద నమ్మకం ఉంచుకోండి. అప్పుడే మీరు లైఫ్‌లో ఏదైనా సాధించగలరు.

    అతిగా ఆలోచించడం
    చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించవద్దు. కొందరు చిన్న సమస్యలకు కూడా ఎక్కువగా ఆలోచించి సమస్యలను పెద్దవి చేసుకుంటారు. ఈ అలవాటు ఉండటం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి అతిగా ఆలోచించే అలవాటు ఉంటే మానుకోండి.

    భవిష్యత్తు కోసం భయపడటం
    కొందరు చిన్న విషయాలకు ఎక్కువగా భయపడుతుంటారు. లైఫ్‌లో భయపడకుండా డేరింగ్‌గా ఉండాలి. ఏం జరిగినా పర్లేదు.. ఫేస్ చేయాలనే ఆలోచనతో ఉండాలి. అప్పుడే మీకు భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చిన పరిష్కరించుకోగలరు. ప్రతీ విషయానికి భయపడితే ఆ సమస్య నుంచి బయటపడలేరు.