schools : మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఇప్పుడు చాలా బాధ పడుతున్నారు. పిల్లల గురించి వారి బాధ మరింత పెరుగుతుంది. పిల్లలను చాలా మంది తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ లో చదివించడం లేదు. ఇలా చదివించే పేరెంట్స్ చాలా తక్కువ. ఇక మిగిలిన ఆప్షన్ ప్రైవేట్. ప్రైవేట్ స్కూల్ లో చదివించాలంటే చాలా డబ్బు కావాలి. అంత డబ్బు పెట్టే స్థోమత ఉండటం లేదు. అందుకే పిల్లల ఫ్యూచర్ గురించి, వారి చదువులు గురించి ఆలోచించి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రిచ్ పీపుల్స్ టాప్ స్కూల్ లో చదివించాలని ఆరాటపడుతుంటారు. డబ్బు ఉన్నవారు మాత్రం వారి పిల్లలను టాప్ స్కూల్ లో చదివించగలుగుతున్నారు. నార్మల్ పేరెంట్స్ మాత్రం కేవలం అప్పులు చేస్తూ, లోన్ లు తీసుకుంటూ చదివిస్తున్నారు. పూర్, రిచ్ గురించి కాసేపు పక్కన పెడితే మన ఇండియాలో ఉన్నా టాప్ స్కూల్స్ ఏంటి? అవి ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందామా? మీరు గనుక అందులో మీ పిల్లలను చదివించాలి అనుకుంటే ఆ సారి లుక్ వేసి తెలుసుకోండి. మీ పిల్లలను కూడా జాయిన్ చేయండి.
చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టమైన పడటానికి సిద్ధం అవుతున్నారు. సమాజంలో ఎదురు అవుతున్న సమస్యల దృష్ట్యా వారి ఆ సవాల్లను ఎదుర్కోవడానికి మంచి స్కూల్ కూడా ముఖ్యం అనుకుంటున్నారు. అందుకే అన్ని విధాల బెటర్ గా ఉండే స్కూల్స్ ను ఎంచుకుంటున్నారు. ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్స్ కు టాప్ ర్యాంక్ ఇచ్చారు. ప్రస్తుతం కాలంలో పిల్లల కోసం పాఠశాలల ఎంపికకు పాఠశాల ఫీజులు కూడా నిర్ణయాత్మక కారకాలుగా మారాయి.
పిలానీలోని బిర్లా పబ్లిక్ స్కూల్ ప్రతి నెలా రూ. 40,000 వసూలు చేస్తుంది. సంవత్సరానికి రూ. నలభై వేలు కాదండీ. జస్ట్ నెలకు 40 వేలు చెల్లించాలి. డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలుర పాఠశాలలో నెలవారీ ఫీజు సుమారు రూ. 65,000. అజ్మీర్‌లోని మాయో కాలేజీకి నెలవారీ రుసుము రూ. 60,000. ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్, ముంబైలో నర్సరీ, జూనియర్ తరగతులకు వార్షిక రుసుము 6,90,000 కాగా 11-12 తరగతికి రూ. 10,90,000. ఇక సింధియా స్కూల్, గ్వాలియర్‌లో నెలవారీ రుసుము రూ. 77,000.
ఊటీలోని గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి నెలా రూ.1,00,000 వసూలు చేస్తుంది. వుడ్‌స్టాక్ స్కూల్, ముస్సోరీ 11-12 తరగతికి వార్షిక రుసుము 13 లక్షల నుంచి 16.5 లక్షల వరకు ఉంటుంది. డూన్ స్కూల్, డెహ్రాడూన్ వార్షిక ఫీజు రూ. 12-14 లక్షలు ఉంటుంది. వామ్మో ఈ ఫీజులు చూసాక సాధారణ ప్రజలు మాత్రం వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు కదా. కోట్లకు పడగలెత్తిన వారికి ఈ ఫీజు నార్మల్ కానీ మధ్యతరగతి వారు ఈ స్కూల్ వైపు చూడాలంటే కూడా భయపడతారు. సంవత్సరానికి వేల ఫీజులు కట్టాలంటే భయపడుతున్న ప్రజలు. నెలకు 50 వేల నుంచి 80 వేల వరకు కట్టగలరా? కల కదా.