Gold Price India July 2025: నిన్నా మొన్నటి వరకు అమాంతం పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గురువారం ఊహించనంతగా ఎక్కువ స్థాయిలో బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో ఇక బంగారం కొనేయచ్చు.. అన్న ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రావణమాసం ప్రారంభం కావడంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో రేపటి నుంచి బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Also Read: మీరు జీవితంలో ఎదగాలంటే ఈ ఒక్కటి పక్కకు పెట్టండి..
బులియన్ మార్కెట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు 92,500 గా నమోదైంది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.1,00970 గా నమోదైంది. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు 92,700 గా నమోదైంది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.1,0,1120 గా నమోదైంది. ముంబయ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు 92,500 గా నమోదైంది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.1,00970 గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు 92,500 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.1,00970 గా నమోదైంది. బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు 92,500 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.1,00970 గా నమోదైంది. హైదరాబాద్ లో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు 92,500 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.1,00970 గా నమోదైంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.1,28,000లతో కొనసాగుతోంది.
Also Read: శ్రీరాముడే కోట్లు తెచ్చే దేవుడు.. ఇదో నయా దందా!
మొన్నటి వరకు అంతర్జాతీయ కారణాలతో బంగారం ధరల్లో మార్పులు వచ్చాయి. రోజురోజుకు బంగారం ధరలు పెరిగి లక్ష రిమార్క్ దాటింది. అయితే ఇప్పుడు ఒక్కసారి రూ.12,500 తగ్గింది. ఇంత భారీస్థాయిలో తగ్గడంతో బంగారం కొనాలని అనుకునేవారు రెడీ అవుతున్నారు. ఎందుకంటే బంగారం ఒకేసారి తగ్గి మళ్లీ పెరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయితే గురువారం అమావాస్య కావడంతో చాలా మంది బంగారం కొనడానికి ముందుకు రారు. శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా శుక్రవారం లక్ష్మీదేవికి అనుకూలమైన రోజుగా భావిస్తారు. అందువల్ల ఈరోజు బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. అయితే రేపటి వరకు బంగారం ధరలు ఎలా ఉంటాయనేది తెలియాలి. బంగారంపై ఇన్వెస్ట్ మెంట్ చేసేవారు మాత్రం తిరిగి కొనుగోలు చేయడానికి వెనుకడుగువేస్తున్నారు.