Gold, Silver Prices: రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెరుగుతున్న ధరల వల్ల బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వాళ్లపై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతోంది. అయితే ఈరోజు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 49,400 రూపాయలుగా ఉంది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం ఏకంగా 53,890 రూపాయలుగా ఉండటం గమనార్హం. బంగారం ధర అంతకంతకూ పెరుగుతుండగా వెండి ధర మాత్రం తగ్గుతోంది. కిలో వెండి ధర ఏకంగా 1,000 రూపాయలు తగ్గింది. 71,000 రూపాయల నుంచి వెండి 70,000 రూపాయలకు తగ్గడం గమనార్హం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.
Also Read: బిగ్ బ్రేకింగ్: అసెంబ్లీలో 91142 ఉద్యోగాలను ప్రకటించిన కేసీఆర్
అయితే అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. బంగారం ధరలపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. ప్రాంతాన్ని బట్టి బంగారం, వెండి ధరలలో స్వల్పంగా మార్పు ఉండే అవకాశం ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లు వెంటనే కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.
నిపుణులు సైతం బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. . రాబోయే రోజుల్లో కనీవిని ఎరుగని స్థాయిలో బంగారం ధరలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
Also Read: బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా లేరా?