CM Jagan Early Elections: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు జ్వరం పట్టుకుంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రెండు ప్రాంతాల్లో నాయకుల్లో చలనం మొదలైంది. ఇన్నాళ్లు ఎటు తిరగలేకున్నా నియోజకవర్గాలు చుట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా పెండింగు పనుల ప్రారంభోత్సవాలకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. ప్రజలతో మమేకమవ్వాలని తాపత్రయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ముందస్తుపై ఊహాగానాలు జోరుగా వస్తున్నాయి.

తెలంగాణలో సీఎం కేసీఆర్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం సాగడంతో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు జగన్ కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా కార్యకర్తలకు ఉద్బోదిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందని అనుమానిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్తున్నట్లు తమ మైండ్ సెట్ మార్చుకుంటున్నారు.
సీఎం జగన్ కూడా రాష్ట్రంలో ఎక్కడైనా పనులు చేయకుండా పెండింగులో పెడితే వాటిని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతోనే ముందస్తు ఎన్నికలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని మంత్రి కేటీఆర్ చెబుతున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే జోస్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
వైఎస్ జయంతి సందర్భంగా వైసీపీ ప్లీనరీ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం త్వరలో జరిపే జయంతికి ముందే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలను చుట్టేసి ప్రజలతో కలిసిపోవాలని జగన్ చెబుతుండటంతో ముందస్తుపై అందరికి అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో ఇక ప్రభుత్వాన్ని నపపడం అంత సులువు కాదనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్టుగా ఉంది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం సాగుతోంది.

దీనికి తోడు కేంద్రం జమిలి ఎన్నికలకు ప్రయత్నాలు చేస్తుండటంతో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో తెలియడం లేదు. ఈ క్రమంలోనే ఎన్నికలు ఇప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్ని పార్టీలు నేతలకు చెబుతున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని జగన్, కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిపక్షాలు సైతం అదే విధంగా ఆలోచిస్తున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ నేతలను సమాయత్తం కావాలని సూచిస్తున్నాయి. టీడీపీ కూడా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తోంది.
[…] Chandrababu BJP: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావించినా ఇప్పుడు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. దీంతో బీజేపీతో వియ్యానికంటే కయ్యానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన పనులు కూడా అదే సూచిస్తున్నాయి. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అందుకే బీజేపీతో పొత్తు లాభం చేకూర్చదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని భావించినా పవన్ కల్యాణ్ బీజేపీతో టై అప్ అయి ఉండటంతో ఇక తనకు తలుపులు తీయరనే అభిప్రాయంతోనే బీజేపీతో పొత్తుకు నై అంటున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. […]
[…] […]
[…] […]