Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డిని( Y S Jagan Mohan Reddy) పులిగా అభివర్ణిస్తారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎదుర్కొన్నప్పుడు నిజంగా ఆయన పులి. 2014 నుంచి 2019 మధ్య అధికార తెలుగుదేశం పార్టీని ఎదుర్కొన్న తీరు చూస్తే ఆయన నిజంగా పులి. 2019 నుంచి 2024 మధ్య అన్ని ఎన్నికల్లో విజయం సాధించి నిజమైన బెబ్బులి అనిపించుకున్నారు. కానీ 2024 ఎన్నికల తరువాత ఆయన పులి కాదు.. పిల్లి అని అనలేము కానీ.. మునుపటి దూకుడు, ధైర్యం ఆయనలో కనిపించడం లేదు. అయితే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. తాను కేసుల నుంచి బయటపడాలి.. బయటపడిన తర్వాత రాజకీయం చేయాలి. ముందుగా కేసుల నుంచి బయటపడితేనే భవిష్యత్తులో రాజకీయం చేయగలరు. అందుకే తనలోనున్న తెగువ, దూకుడు గణనీయంగా తగ్గించుకున్నారు.
Also Read: కాంగ్రెస్ తో జగన్ రాజీ?
బయటకు కనిపించని జగన్.. పులివెందుల( pulivendula) జడ్పిటిసి ఫలితాలు వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి పెద్దగా బయటకు కనిపించడం లేదు. మొన్న ఆ మధ్యన అనంతపురంలో ఓ పెళ్లికి హాజరయ్యారు. అటు నుంచి అటే బెంగళూరు వెళ్ళిపోయారు. అప్పటినుంచి యలహంక ప్యాలెస్ లోనే గడుపుతున్నారు. అయితే ఒకవైపు బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలుపుతూనే.. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేస్తున్నారన్న అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఇలా చేస్తున్నారేంటి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఏకంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇంటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి వెళ్లారు. జగన్ ఆజ్ఞ లేనిదే ఆయన వెళ్ళను గాక వెళ్లరు కూడా. అయితే ఏకకాలంలో ఆయన బిజెపితో పాటు కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులు ఇవి. బయటకు తెలియదు అని అనుకోవడం పొరపాటే.
బిజెపితో వన్ సైడ్ లైన్..
ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీతో( Bhartiya Janata Party) ఆయన వన్ సైడ్ లైన్ కలుపుతున్నారు. బిజెపి సైతం ఒక రాయి వేసి జగన్మోహన్ రెడ్డిని తన అదుపులో ఉంచుకుంది. అలాగని దగ్గర చేర్చుకోవడానికి కాదు కానీ.. తెలుగుదేశం పార్టీని కంట్రోల్ చేయాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆమాత్రం చిన్నపాటి భరోసా.. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తీసుకోవడం లాంటిది. అయితే జగన్ సైతం బిజెపి పై ప్రేమతో మద్దతు తెలపలేదు. ముందుగా తాను జైలుకు వెళ్లకుండా ఉంటేనే.. తరువాత ఏదైనా రాజకీయం చేయవచ్చు కదా అనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే బిజెపిని వదిలి పెట్టడం లేదు. పట్టుకుంటూ వస్తున్నారు. మారు మాట ఆడకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. మద్దతు అయితే తెలిపారు కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఆశించిన స్థాయిలో రిప్లై రావడం లేదు.
Also Read: జగన్ కు కేంద్రం షాక్
కాంగ్రెస్ విషయంలో యూటర్న్..
కాంగ్రెస్ పార్టీ( Congress Party) విషయంలో జగన్మోహన్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో వేదిక పంచుకునేందుకు కూడా జగన్ ఇష్టపడరు. అంతెందుకు తాను జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే కనీసం కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇవ్వలేదు. సహకారం కోరలేదు. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉంటే.. ఆ పార్టీకి చెందిన ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ఏకంగా ఖర్గే ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. బిజెపితో కేసులపరంగా ఉంటే.. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏంటి అనే అంశం ఆలోచించి ఆ పార్టీ పక్కన కర్చీఫ్ కూడా వేసుకున్నారు. కానీ జగన్ వైఖరి కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అంత వేగంగా నమ్ముతుందనుకుంటే పొరపాటే. అయితే ఇన్నాళ్లు పులి.. ఎప్పుడు ఒంటరి పోరాటమే.. విశ్వసనీయ నేత.. ఢిల్లీని గడగడలాడించిన నాయకుడు.. ఇలా ఎన్నెన్నో చెప్పుకొచ్చారు కానీ.. ఇప్పుడు జగన్ గురించి అసలు వాస్తవాలు తెలుస్తున్నాయి.