Bigg Boss Telugu 9 Agnipariksh: రీసెంట్ గానే జియో హాట్ స్టార్(Jio Hotstar) లో మొదలైన ‘అగ్ని పరీక్ష'(Agniopariksha) షోకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ప్రక్రియ లో భాగంగా లక్షల దరఖాస్తుల నుండి కేవలం 45 మందిని ఎంచుకొని, వాళ్లకు వివిధ రకాల టాస్కులను నిర్వహించి కేవలం 5 మంది సామాన్యులను బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) లోకి పంపే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ముగ్గురు కంటెస్టెంట్స్ నేరుగా టాప్ 15 లోకి వెళ్లారు. మిగిలిన కంటెస్టెంట్స్ లో కొంతమందిని హోల్డ్ లో పెట్టారు, మరికొంత మందిని పంపేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ అగ్ని పరీక్ష షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ ని కొంతమందిని చూసిన తర్వాత అసలు ఇలాంటి నీచమైన ఆలోచనలు ఉన్నవాళ్ళని ఎలా ఇక్కడి వరకు తీసుకొచ్చారు అని అనిపించింది.
Also Read: ‘అగ్ని పరీక్ష’ లో అభిజిత్ ని మించిన తెలివైనోడు..దుమ్ములేపేసిన మనీష్!
అంటే గ్రూప్ డిస్కషన్స్ లో నోటికి వచ్చింది మాట్లాడేసి డామినేట్ చేస్తే తదుపరి రౌండ్స్ కి క్వాలిఫై చేసేస్తారా?, జనాలు ఆసక్తి గా ఈ షోని చూసేందుకు టీవీల ముందు కూర్చుంటే ఇలాంటి వాళ్ళని చూసే కర్మ వాళ్లకి ఎందుకు బిగ్ బాస్ యాజమాన్యం కల్పిస్తుందో అర్థం కావడం లేదు. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎలాంటోడో చూద్దాం. ఇతని పేరు రవి అంట. దురదృష్టం కొద్దీ ఇతని శ్రీకాకుళం కి చెందిన వాడట. శ్రీకాకుళం వాళ్ళు ఇలాంటి మనుషులు మా ఊర్లో ఉన్నారా అని బాధపడకండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్లకు ఎంత దూరంగా ఉంటే మంచిదో ఆలోచించండి. ఇతని దృష్టిలో మగవాళ్లే గొప్ప అట, ఆడవాళ్లు కాదట. శ్రీముఖి ఇతనికి ఒక టాస్క్ ఇస్తూ అమ్మాయి లాగా చీర కట్టుకొని హై హీల్స్ వేసుకొని, అక్కడి నుండి నడుచుకుంటూ వస్తూ ‘అమ్మాయిలు గొప్పవాళ్ళు’ అని చెప్పమని అంటుంది.
అప్పుడు ఇతను టాస్క్ కోసం కావాలంటే చెప్తా, నా దృష్టిలో మగవాళ్లే గొప్ప అని అంటాడు. బిందు మాధవి ఇతని ప్రవర్తన కి చిరాకు పడి, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు అర్జెంటు గా అంటూ రెడ్ ఫ్లాగ్ చూపిస్తుంది. ఆ తర్వాత ఆడవాళ్లు ఎందుకు గొప్ప కాదు, చెప్పు అసలు నువ్వు అంటే, ఆడవాళ్లు అరగంటసేపు బిడ్డకు జన్మని ఇవ్వడానికి నరకాన్ని చూసి వస్తారు, కానీ మగవాళ్ళు జీవితం లో ఎన్నో కష్టాలను మనసులో దాచుకొని ఒక స్త్రీ బిడ్డకు జన్మని ఇవ్వడానికి పడే కష్టం కంటే ఎక్కువ కష్టం పడుతాడు అని చెప్పుకొస్తాడు. జడ్జీలకు ఇతని ప్రవర్తన చూసి చిరాకు కలిగింది. ఎలాంటివారినైనా తట్టుకొని చలాకీ గా స్పందించే యాంకర్ శ్రీముఖి కి కూడా సహనం కోల్పోతుంది. ఒక బిడ్డకు జన్మని ఇవ్వడానికి తల్లి 9 ఏళ్ళు నరకం లాంటి బాధ ని సంతోషంగా అనుభవిస్తుంది, ఆమె శరీరం తీసుకునే బాధ ఈ సృష్టి లో ఏ జీవి కూడా తీసుకోలేదు. ఈరోజు నువ్వు భూమి మీదకు వచ్చి ఇలా స్త్రీల గురించి మాట్లాడేంత స్వేచ్ఛ ఉందంటే అందుకు కారణం ఒక స్త్రీ. అలాంటి స్త్రీ ఒక బిడ్డకు జన్మని ఇవ్వడం ఇతని దృష్టిలో పెద్ద విషయం కాదట. ఇలాంటోళ్లని ఏమి అనాలో మీరే నిర్ణయించండి.