Plants : జస్ట్ తీగ కదా అని లైట్ తీసుకోకండి.. తీగ కంటే పొడుగు ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

పల్లెల్లో ఎన్నో మొక్కలు కనిపిస్తుంటాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అయితే మీకు తిప్పతీగ గురించి తెలుసా? ఆయుర్వేదం ప్రకారం తిప్పతీగను అమృతంతో పోల్చి చెబుతారు. పల్లెల్లో విరివిగా లభించే ఈ తీగపాదు అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలకు మూలం. ఆయుర్వేదం ప్రకారం ఇది ఒక సూపర్‌ మూలికగా పేరు గాంచింది. డెంగ్యూ, డయాబెటిస్ వంటి అనేక వ్యాధుల్ని దూరం చేయడంలో సహాయం చేస్తుంది కూడా. ఇమ్యూనిటీ పెంచేందుకు కూడా తోడ్పడుతుంది. మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి అవేంటంటే?

Written By: Swathi Chilukuri, Updated On : October 30, 2024 3:27 pm

Don't take the light as if it is just a string.. There are also advantages of length over string..

Follow us on

ఈ  తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఉపయోగపడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను, వ్యాధిని కలిగించే క్రిములను అరికడతుంది ఈ తిప్పతీగ. తిప్పతీగ రసం తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. అంతేకాదు జ్వరం నుంచి ఉపశమనం పొందేందుకు తిప్పతీగ ఆకులు చాలా బాగా పనిచేస్తాయట కూడా.

తిప్పతీగను వివిధ రూపాల్లో తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. తిప్పతీగ శరీరంలోని టాక్సిన్లను తొలగించడానికి కూడా సహాయ పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయం చేస్తుంది. యూటీఐ సమస్యలను దూరం చేస్తుంది ఈ తిప్పతీగ. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా దూరం చేయవచ్చు. ప్రతి రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అంటున్నారు నిపుణులు.

తిప్పతీగలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచుడంలో సహాయం చేస్తాయి. దీంతో డయాబెటిస్‌ నుంచి ఉపశమనం పొందవచ్చు. తిప్పతీగలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా మార్చడానికి కూడా సహాయ పడతాయి. తిప్పతీగను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. దీని వల్ల దగ్గు, జలుబు, ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది.

తిప్పతీగను అడాప్టోజెనిక్ హెర్బ్‌గా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. తిప్పతీగ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా తోడ్పడుతుంది. ఒత్తిడిని కంట్రోల్‌ చేసి ఆందోళనను దూరం చేస్తుంది. తిప్పతీగ రసం తాగడంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కంట్రోల్‌ లో ఉంటాయి. దీంతో గుండె పనితీరు మెరుగు అవుతుంది. గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు కూడా. ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేస్తుంది ఈ తిప్పతీగ. శరీరంలో పేరుకునే విష పదార్ధాలను బయటకు తరిమేయడానికి కూడా చాలా సహాయం చేస్తుంది.

45 ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో ఎముకలు బలహీనంగా మారడం కామన్ గా చూస్తుంటాం. తిప్పతీగ రసం తాగితే మహిళల్లో బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం తగ్గిపోతుంది అంటున్నారు నిపుణులు.  ఈ తీగ రసం రూపంలో తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు కూడా. రోజూ తీసుకోవడం వల్ల క్రాంప్స్ నొప్పులు తగ్గుముఖం పడతాయి. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం తిప్పతీగ రసం తీసుకోవడం చాలా మంచిది.