Life Story: అదృష్టం ఎవరి తలరాతను ఎప్పుడు ఎలా మారుస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు. కొందరి జీవితాలు అనుకోని మలుపులతో అందళం ఎక్కిన సందర్భాలు అనేకం చూశాం. కిల్లీ కొట్టు నడుపుకునే వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావడం, ఆటో డ్రైవర్ కు లాటరీలో లక్షలు తగలడం లాంటివి చూశాం. అయితే ఇప్పుఉడు మేం చెప్పబోయేది కూడా ఇలాంటి అదృష్ట వంతుడి కథ గురించే. అయితే అతని మంచితనమే అతనికి అదృష్టాన్ని తీసుకు వచ్చింది.

అతనికి 20ఏండ్ల వయసు ఉన్నప్పుడు అతను ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు. పొద్దంతా ఆటో నడపటం, రాత్రికి ఆటోను యజమానికి అప్పగించడం ఇలా సాగిపోయేది. అయితే అతనికి తెలిసిన ఓ వ్యక్తి.. ఇలా పొద్దస్తమానం ఆటో నడిపడం కష్టం అని, తనకు తెలిసిన మొబైల్ క్యాంటీన్‌కు ట్రక్ నడిపేందుకు వెళ్లమని సలహా ఇచ్చాడు. కేవలం సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9వరకు ఉంటే చాలని చెప్పడంతో ఇతను కూడా అక్కడకు వెళ్లి అందులో జాయిన్ అయ్యాడు.
Also Read: సంచలనం: 15 ఏళ్ల బాలికను వదల్లేదు.. టీఆర్ఎస్ నేతపై అత్యాచారం కేసు
ఆ క్యాంటీన్ నడుపుతున్న ఆమెకు 50 ఏండ్లు ఉంటాయి. అయితే ఆమె టిఫిన్స్ మాత్రమే చేస్తుంది. ఆమె 18 ఏండ్ల కూతురు వాటిని అమ్ముకుని వస్తుంది. ఇలా వారికి అతను సాయం చేస్తూ వారి దగ్గరే పని చేస్తున్నాడు. ట్రక్ నడుపుతున్న సమయంలో పెద్దావిడ కూతురితో ఇతనికి చనువు బాగా పెరిగిపోయింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే అతనికి పెద్దావిడ ఓ పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పింది. వారిద్దరూ ప్రేమలో ఉన్నట్టు ఆమెకు తెలియదు. అయినా కూడా తన కూతురిని పెండ్లి చేసుకోవాలంటూ కోరింది. దీనికి మనోడు ఎగిరి గంతేశాడు. ఇంకేముంది ఆరు నెలలు తిరగకుండానే ఇద్దరి పెండ్లి జరిగిపోయింది. అలా ఇద్దరూ కలిసి క్యాంటీన్ వ్యాపారాన్ని బాగా పెంచేసుకున్నారు. ఎంతలా అంటే.. క్యాంటీన్ నడిపిన చోటే రెస్టారెంట్‌ను నెలకొల్పారు. ప్రస్తుతం వీరి వ్యాపారం బాగా పెరిగిపోయింది. అయితే అతని అత్త మాత్రం ఇప్పుడు చనిపోయింది. ఇలా ఇతనికి అనుకోకుండా లక్ తగిలి కోటీశ్వరుడు అయిపోయాడు.
Also Read: అసెంబ్లీకి చంద్రబాబు వస్తారా? రారా? శపథం ఏమైంది?
Recommended Videos