Upcoming Telugu Movies On OTT: నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అసలు ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే.

పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.
Also Read: టాలీవుడ్ లోనే అతి తక్కువ వసూళ్లు రాబట్టిన స్టార్ ఆయనే
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
ఆహా :
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

జీ5 :
విశాల్ కథానాయకుడిగా శరవణన్ దర్శకత్వంలో తాజా చిత్రం ‘సామాన్యుడు’ మార్చి 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
నెట్‌ఫ్లిక్స్ :
గ్రైన్స్ ద ఐస్(హాలీవుడ్) మార్చి 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ద వీకెండ్ ఎ వే (హాలీవుడ్) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
పీసెస్ ఆఫ్ హర్ (ఒరిజినల్ సిరీస్)మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ :

నో టైమ్ టు డై (హాలీవుడ్) మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
సోనీ లివ్ :
అన్ దేఖీ (హిందీ సిరీస్) మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఎమ్ ఎక్స్ ప్లేయర్ :
వాండర్‌లస్ట్ (హిందీ సిరీస్) మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
డిస్నీ – హాట్ స్టార్ :

రుద్ర ద ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ (హిందీ సిరీస్) మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
సుత్ లియాన్ (హిందీ సిరీస్) మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read: ఏపీలో సినిమా టికెట్ల రేట్ల పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు