https://oktelugu.com/

Gifts: చాణక్య నీతి : ఈ వస్తువులను బహుమతిగా ఇస్తున్నారా?

వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇచ్చే బహుమతులు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అందువల్ల కొన్ని బహుమతులు ఇవ్వడం మంచిది కాదని తెలుసుకోండి. ఇచ్చే బహుమతులు అక్కడ శక్తిని, ఆ ఇంటిని రెండింటిని ప్రభావితం చేస్తాయట. ఆ ఇంట్లో ఉండే శక్తి లో మార్పులు కూడా వస్తాయట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 11, 2024 9:52 am
    Gifts

    Gifts

    Follow us on

    Gifts: బంధువులకు, స్నేహితులకు, ఇష్టమైన వారికి బహుమతులు ఇవ్వడం కామన్. సందర్భాన్ని బట్టి బహుమతులు ఇవ్వడం కూడా కామన్. ఆ ఫంక్షన్ ను బట్టి వారికి ఏది నచ్చుతుందో అలాంటి బహుమతులు ఇవ్వాలని అనుకుంటారు. కొన్ని వస్తువులు బహుమతిగా ఇస్తే మంచిది. కొన్ని వస్తువులు ఇవ్వకపోవడం మంచిది. అయితే మీరు బహుమతి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలాంటి వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఏది ఇవ్వాలి అనుకుంటున్నారు? వాటి వల్ల ఏదైనా నష్టం ఉంటుందా అనే విషయాలు కూడా ఆలోచించాలి.

    వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇచ్చే బహుమతులు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అందువల్ల కొన్ని బహుమతులు ఇవ్వడం మంచిది కాదని తెలుసుకోండి. ఇచ్చే బహుమతులు అక్కడ శక్తిని, ఆ ఇంటిని రెండింటిని ప్రభావితం చేస్తాయట. ఆ ఇంట్లో ఉండే శక్తి లో మార్పులు కూడా వస్తాయట. అందుకే కొన్ని బహుమతులు అస్సలు ఇవ్వకూడదు. వారి ఇంట్లో సానుకూల పురోగతి ఉండాలంటే కొన్ని గిఫ్టులను ఇవ్వకపోవడమే మంచిది. ఇంతకీ అవేంటంటే..

    కత్తులు, పదునైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో అయినా బహుమతిగా ఇవ్వకూడదు. దీని వల్ల ఈ ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుందట. అలాగే నలుపు రంగుకు ప్రతికూలతను కలిగి ఉంటుంది. అందుకే నల్లని బట్టలు, వస్త్రాలు, పదార్థాలు ఇవ్వకూడదు. ఇక ముళ్ళు ఉండే మొక్కలను కూడా బహుమతిగా అస్సలు ఇవ్వకూడదట. గడియారం కూడా బహుమతిగా ఇవ్వకూడదు. అంతే కాదు ఎలక్ట్రానిక్ బహుమతులు కూడా ఇవ్వకూడదు అంటున్నారు నిపుణులు.

    కొందరు బ్యాగులు, పర్సులు, తోలు వస్తువులను కూడా ఇస్తుంటారు. ఇలా తోలు వస్తువులు కూడా ఇవ్వకూడదు. చర్మం ప్రతికూల శక్తితో ముడి పడుతుంది కాబట్టి ఇలాంటి వాటిని బహుమతిగా ఇవ్వకూడదని తెలుపుతుంది వాస్తు శాస్త్రం. మరి తెలుసుకున్నారు కదా ఎలాంటి వాటిని బహుమతిగా ఇవ్వకూడదో.. ఇక నుంచి ఇలాంటి వస్తువులను గిప్ట్ గా ఇవ్వకండి.