Girls: ప్రతి ఒక్కరూ వారికి అందంగా ఉన్న భాగస్వామి రావాలనే కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే చెప్పక్కర్లేదు. పొడుగు, రంగు ఉండే అబ్బాయిలను ఇష్టపడతారని చాలా మంది భావిస్తారు. కానీ అమ్మాయిలు ఎక్కువగా అందమైన అబ్బాయిల కంటే యావరేజ్‌గా ఉండే అబ్బాయిలనే ఇష్టపడతారని నిపుణులు చెబుుతున్నారు. ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు. వాళ్ల ప్రవర్తన, కేరింగ్, ప్రేమను చూసి ఇష్టపడుతుంది. ఈమధ్య కాలంలో అమ్మాయిలు అందగాళ్ల కంటే యావరేజ్‌గా ఉండే అబ్బాయిలనే ఎక్కువగా చూస్తున్నారని ఓ సర్వే తెలిపింది. అబ్బాయి రంగు అన్ని తక్కువగా ఉన్నా కూడా.. అమ్మాయిలు వారిని చూసి ప్రేమలో పడిపోతారు. కానీ ఈ విషయాన్ని అబ్బాయిలకు చెప్పరు. వారి మనసులోనే దాచుకుంటారు. అబ్బాయిలకి వాళ్ల ప్రేమ విషయం చెప్పరు. చెబితే ఏం అనుకుంటారో అనే భయంతో దాచేస్తారు.
అబ్బాయి ఎంత యావరేజ్‌గా ఉన్నా కూడా అతనికి నేను నచ్చుతానా? లేకపోతే తనకి ఎవరైనా అమ్మాయి ఉందా? పెళ్లి అయిపోయిందా? నాకు కరెక్టేనా? పెళ్లి చేసుకుంటే బంధం హ్యాపీగా ఉంటుందా? ఫ్యామిలీని బాగా చూసుకుంటారా? ఇలాంటి అన్ని విషయాలు ఆలోచించి వాళ్ల ప్రేమ విషయాన్ని దాచి పెడతారు. కానీ వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. వాళ్ల పూర్తి వివరాలు తెలుసుకుని.. దానికి తగ్గట్లుగా ప్లాన్ చేయాలని అనుకుంటారు. సినిమాల్లో చూపించినట్లు ఆరుడుగుల అందం, గడ్డం, స్మార్ట్‌గా ఉంటేనే అబ్బాయిలు నచ్చుతారని అనుకోవద్దు. అవన్నీ సినిమాల వరకు పరిమితం మాత్రమే. అమ్మాయిలు ఎక్కువగా తక్కువ గడ్డం ఉన్నవారినే ఇష్టపడతారు. గడ్డం ఉండాలి కానీ మరీ ఎక్కువగా కాకుండా ఉండి లేనట్లు ఉంటేనే ఇష్టమట. అలాగే పెంపుడు జంతువులకు దగ్గరగా ఉండాలి. వాటిని పెంచుతుంటేనే అమ్మాయిలకు ఇష్టం. అలాగే అబ్బాయిలకు బాధ్యత ఉండాలి. డబ్బు మీద నిర్లక్ష్యంగా ఉండి, దాని విలువ తెలియకుండా ఖర్చు పెడుతుంటే.. అమ్మాయిలకు నచ్చరు. ఎంత డబ్బు సంపాదించిన దానిని జాగ్రత్తగా కాపాడుకునే అబ్బాయిలంటే ఇష్టం.
అబ్బాయిలు కాస్త డస్కీ రంగులో ఉండి.. కుటుంబాన్ని బాగా చూసుకున్న వారైతే కావాలని అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఎలా ఉన్న తనని, కుటుంబాన్ని బాగా చూసుకుంటే హస్బెండ్ మెటీరియల్ అని తెగ ఇష్టపడతారు. కాబట్టి అబ్బాయిలు యావరేజ్ ఉన్నామని, మమ్మల్ని ఎవరు ఇష్టపడతారని అనుకోవద్దు. మిమ్మల్ని నచ్చే అమ్మాయిలు ఉంటారు. కాకపోతే వారిని మీరు గుర్తించరు. మీరంటే ఎవరికి ఇష్టమో గుర్తించి ఆ అమ్మాయితో హ్యాపీగా ఉండండి. అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసిందని కొందరు హేళనగా చూస్తారు. అలా చూడకుండా తనలో ఉన్న ప్రేమను గుర్తించి ఆమెను మంచిగా చూసుకుంటే జీవితం బాగుంటుంది. మిమ్మల్ని ఎవరు ఇష్టపడరు అనే నెగిటివ్ ఆలోచన నుంచి బయటకు రండి. పాజిటివ్ ఆలోచనతో ఉంటే మీరు కోరుకున్న విధంగా అమ్మాయి మీ లైఫ్‌లోకి వస్తుంది. కాబట్టి అబ్బాయిలు కాస్త కాన్ఫిడెన్స్ పెంచుకుని లైఫ్‌లో ముందుకెళ్తే లైఫ్ అంతా రంగులతో మెరిసిపోతుంది.