https://oktelugu.com/

Business Tips: తక్కువ పెట్టుబడి బిజినెస్ కోసం చూస్తున్నారా.. ఇది మీ కోసమే..

ప్రభుత్వాలు డిమాండుకు తగినట్లుగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోవడంతో చాలా మంది బిజినెస్‌లపై దృష్టి పెడుతున్నారు. అందులోనూ సెల్ఫ్‌గా సొంత బిజినెస్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగాల కోసం సమయం వృథా చేసుకోకుండా ప్రత్యామ్నాయం వైపుగా మళ్లుతున్నారు. మార్కెట్లోకి ఏదో కొత్తగా తీసుకురావాలని తాపత్రపడుతుంటారు. బిజినెస్ పెట్టాలనుకోవడం మంచి నిర్ణయమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బిజినెస్ లోకి దిగడం అంటే ఆచితూచి అడుగువేయాల్సిందే.

Written By:
  • Srinivas
  • , Updated On : September 28, 2024 4:13 pm
    Business Tips

    Business Tips

    Follow us on

    Business Tips: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత గొప్ప చదువులు చదివినా అందరికి గవర్నమెంట్ కొలువులు వస్తాయన్న గ్యారంటీ లేదు. చాలా మంది యువత డిగ్రీలు, పీజీల పట్టాలు చేతిలో పట్టుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. దేశంలో, రాష్ట్రాల్లో రోజురోజుకూ గ్రాడ్యుయేట్లు పెరుగుతున్నా ఆ స్థాయిలో ఉద్యోగాల కల్పన లేకుండాపోయింది. చివరకు మున్సిపాలిటీలో ఒక స్వీపర్ జాబ్‌కు కూడా వేలాది సంఖ్యలో వచ్చి పడే పరిస్థితి వచ్చింది. దానికి కూడా ఇంజినీర్లు చదివిన విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు అప్లై చేయడం చూస్తుంటే దేశంలో ఏ స్థాయిలో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అటు పెళ్లిళ్లు కావాలన్నా ఉద్యోగాలే ప్రమాణికం.

    అయితే.. ప్రభుత్వాలు డిమాండుకు తగినట్లుగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోవడంతో చాలా మంది బిజినెస్‌లపై దృష్టి పెడుతున్నారు. అందులోనూ సెల్ఫ్‌గా సొంత బిజినెస్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగాల కోసం సమయం వృథా చేసుకోకుండా ప్రత్యామ్నాయం వైపుగా మళ్లుతున్నారు. మార్కెట్లోకి ఏదో కొత్తగా తీసుకురావాలని తాపత్రపడుతుంటారు. బిజినెస్ పెట్టాలనుకోవడం మంచి నిర్ణయమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బిజినెస్ లోకి దిగడం అంటే ఆచితూచి అడుగువేయాల్సిందే. ఏ బిజినెస్ లోకి వెళ్తే ఎక్కడ బోల్తా పడుతామో కూడా అర్థం కాదు. అవగాహన, మార్కెట్ ట్రెండ్‌ను అర్థం చేసుకొని ప్రారంభిస్తే ఏ బిజినెస్ లాభాపేక్షంగానే సాగుతుంది. అయితే.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే ఓ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    సాధారణంగా ఐస్‌క్రీమ్‌లు అంటే అందరికీ ఇష్టమే. చిన్న పిల్లలకైతే మరీనూ. ఇక పెద్దలు కూడా సందర్భం చిక్కినప్పుడల్లా లాగిస్తూనే ఉంటారు. పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో తింటూనే ఉంటారు. ఒకటితో ఆగకుండా.. రెండు మూడు తినడం చూస్తుంటాం. అయితే.. ఈ ఐస్‌క్రీమ్ తయారీలో కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. అదే స్నో ఫ్లేక్స్ ఐస్‌క్రీమ్ అట. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా.. తినడానికీ మంచి రుచికరంగా ఉంటుందంట ఈ స్నో ఫ్లేక్స్ ఐస్‌క్రీమ్. దీనిని పాలు, పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్, చెరుకు వంటి వాటితో తయారు చేస్తారు.

    స్నో ఫ్లేక్స్ ఐస్‌క్రీమ్ తయారు చేయాలంటే ఐస్‌క్రీమ్ తయారీ మిషన్ కొనుగోలు చేయాలి. ఈ మిషన్‌లో జ్యూస్ లేదా డ్రింక్స్ వేస్తే చాలు అది స్నో ఫ్లేక్స్ రూపంలో బయటకు వస్తుందని చెబుతున్నారు. వీటిని ఒక కప్పులో వినియోగదారులకు అందిస్తే సరిపోతుంది. వాటిపై డ్రై ఫ్రూట్స్ లేదంటే చెర్రీలు డెకరేట్ చేస్తే కస్టమర్లను మరింత ఆకట్టుకున్న వారం అవుతాం. మంచి రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఇలాంటి మిషన్లను ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు లాభాలు పొందవచ్చని పలువురు వ్యాపార నిపుణులు అంటున్నారు. అయితే.. ఈ మిషన్ ధర కూడా కేవలం రూ.50వేలే అని చెబుతున్నారు. అటు పెళ్లిళ్లలోనూ ఈ రకమైన స్టాల్‌ను ఏర్పాటు చేసుకునే వెసులు బాటు ఉంది. ఇక లాభాలు కూడా ఘణనీయంగా ఉన్నాయి. ఒక్క ఐస్‌క్రీమ్ తయారీకి సుమారుగా రూ.10 నుంచి రూ.15 వరకు ఖర్చు అవుతుంది. దానిని మార్కెట్లో రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయించవచ్చు. అంటే ఒక్క ఐస్‌క్రీమ్‌పై 35శాతం వరకు ప్రాఫిట్ వస్తుందన్నమాట. అలా రోజుకు ఒక వంద వరకు ఐస్‌క్రీమ్‌లు అమ్మినా రూ.3,500 లాభం పొందవచ్చు. ఉద్యోగాల కోసం వేచిచూడకుండా.. తక్కువ పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి ఈ వ్యాపారం చాలా వరకు ఉపయోగపడనుంది.