Post Office Insurance Scheme: ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అనేక ప్రమాదకర సంఘటనలు చూస్తున్నాం. అయితే కొంతమంది మనకు ఏం కాలేదులే అని అనుకుంటారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ పరిస్థితి మనకు కూడా వచ్చే అవకాశం ఉందని భావించాలి. ఎందుకంటే నేటి కాలంలో సాధారణ మరణాల కంటే ప్రమాదాల మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. రోడ్డుపై వాహనాలు వెళ్లడంతోపాటు.. ట్రాఫిక్ ఎక్కువ అవుతుండడంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో హెల్త్ తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం. అయితే రూ. 1000 లోపు ప్రీమియం ఉండే ఇన్సూరెన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటి వివరాల్లోకి వెళితే..
జీవిత, ఆరోగ్య బీమాపై చాలామందికి అవగాహన పెరుగుతోంది. ప్రస్తుత కాలంలో ఇన్సూరెన్స్ చాలా అవసరమని భావిస్తున్నారు. కానీ కొన్ని సంస్థల ప్రీమియంల ధరలు అధికంగా ఉండడంతో వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా డబ్బు తక్కువగా ఉన్నవారు ఇన్సూరెన్స్ అవసరం లేదు అని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో పోస్ట్ ఆఫీస్ సంస్థ వారు ప్రత్యేకంగా తక్కువ మొత్తంలో ప్రీమియంతో కొన్ని ఇన్సూరెన్స్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో భాగంగా 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు వారు ఏడాదికి రూ. 755 ప్రీమియం చెల్లిస్తే.. రూ. 15 లక్షల బీమా వర్తిస్తుంది. ఈ బీమా లో భాగంగా ప్రమాదంలో మరణించినా.. లేదా అంగవైకల్యం ఏర్పడినా.. ఒకే రకంగా బెనిఫిట్స్ వర్తిస్తుంది. అయితే ఈ మొత్తం కూడా భారం అనుకునే వారికి తక్కువ ప్రీమియంతో కూడా ఇన్సూరెన్స్ ను అందుబాటులో ఉంచింది.
అలాంటి వారి కోసం రూ.520 ప్రీమియం చెల్లిస్తే రూ. 10 లక్షల బీమా వర్తిస్తుంది. ఈ బీమా కూడా ప్రమాదంలో మరణించినా.. శాశ్వత వైకల్యం ఏర్పడినా.. అంతే భీమా వర్తిస్తుంది. అంతేకాకుండా ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సమయంలో ఖర్చులకు ప్రత్యేకంగా నగదును అందించే అవకాశం ఉంటుంది. ఇక మరో ప్రీమియం రూ.370 తో కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రీమియం ఏడాదికి చెల్లిస్తే రూ.5 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. అయితే వీరు ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వస్తే రూ. 50 వేల వరకు అందిస్తారు.
అయితే ఇప్పటివరకు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్లలోపు వారికి మాత్రమే ఇన్సూరెన్స్ వర్తించేది. కానీ ఈ బీమాలు 65 ఏళ్ల వరకు వర్తిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అంతేకాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రయోజనాలు పొందాలని అనుకునేవారు ఈ ఇన్సూరెన్స్ చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. అయితే పోస్ట్ ఆఫీస్ సంస్థ కొన్ని ప్రైవేట్ సంస్థలతో కలిసి ఈ ఇన్సూరెన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకునేవారు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లో కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే వారి వయసు, నివాసాన్ని బట్టి వారికి ఎలాంటి బెనిఫిట్స్ వర్తిస్తాయో తెలుసుకోవచ్చు.