
Chanakya Niti- Problems: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు వివరించాడు. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని పరిష్కరించుకునే క్రమంలో ఎన్నో పాట్లు పడుతుంటాడు. జీవితంలో పలు రకాల సమస్యలు ఎదురవడం సహజమే. కానీ కొందరు సమస్యల నుంచి గట్టెక్కుతారు. మరికొందరు అందులో పడి మునిగిపోతుంటారు. ఇంకొందరు తట్టుకోలేకపోతుంటారు. సమస్యల సుడిగుండం నుంచి బయట పడటానికి ప్రయత్నించాలి. అందతేకాని సమస్యల్నే తలుచుకుని బాధ పడితే ప్రయోజనం ఉండదు.
చాణక్యుడు చెప్పినట్లు ప్రవర్తిస్తే మనకు సమస్యలే రావు. వచ్చినా వాటి నుంచి బయట పడటానికి శతవిధాలా ప్రయత్నించి విజయం సాధించాలి. ఆచార్య చాణక్యుడు సూచించిన ప్రకారం మనం నడుచుకుంటే ఇబ్బందులు తలెత్తవు. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలను ఆచరిస్తే సరిపోతుంది. ఎలాంటి బాధల నుంచైనా బయటపడొచ్చు. దీని కోసం చాణక్యుడు ఐదు విషయాలు సూచించారు. దీని వల్ల సమస్యల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.
ప్రతి మనిషికి కూడా జీవితంలో కొన్ని పనులు చేయాలని ఉంటుంది. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. భవిష్యత్ లో ఏం చేయాలనుకుంటున్నామనేది ఎవరికి చెప్పకూడదు. మనమే నిర్ణయించుకోవాలి. ఎవరితోనూ పంచుకోకూడదు. మనలో మనమే తేల్చుకోవాలి. ఈ సూత్రాన్ని పాటిస్తే ఎంతటి సవాళ్లనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించడం అవసరమే. జీవితంలో పలు పనుల కోసం డబ్బు అవసరం ఉంటుంది. అందుకే పొదుపు చేయకపోతే ఇబ్బందులు తప్పవు. మనం సంపాదించే సంపాదనలో ఎంతో కొంత దాచుకుంటే భవిష్యత్ లో అవసరాలకు ఉపయోగపడుతుంది.
వేదాలు, శాస్త్రాలు చదివితే మంచి తెలివి వస్తుంది. దీంతో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ ఏర్పడుతుంది. పుస్తకాలు చదవడం వల్ల మనకు మంచి తెలివితేటలు ఏర్పడతాయి. చాణక్యుడు చెప్పిన సూత్రాల ప్రకారం నడుచుకుంటే ఇబ్బందులు రావు. జీవితంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏ పని అయినా సొంత తెలివితేటలతో వ్యవహరించాలి. ఎవరి పనులు వారే చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంకొకరి మీద నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు.

చుట్టు ఉండే వాళ్లలో మంచివారు చెడ్డవారు ఉంటారు. అందరు మంచివాళ్లుండరు. అలాగని చెడ్డవారుండరు. ఎవరు మంచి వారో ఎవరు చెడ్డవారో తెలియదు. అందుకే మన వ్యక్తిగత వివరాలు ఎవరికి చెప్పకూడదు. జాగ్రత్తగా ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. అంతేకాని ఎవరికి పడితే వారికి మన వ్యక్తిగత విషయాలు వెల్లడించకూడదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఈ నేపథ్యంలో సమస్యల సుడిగుండంలో పడకుండా ఉండేందుకు చాణక్యుడు చెప్పిన వాటిని అనుసరించి మనం కష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.