Friz Tips : డీఫ్ ఫ్రిజ్ లోని వాటర్ ఎక్కువగా గడ్డకడుతుందా..? ఇలా చేయండి..

ఈ వాటర్ ఎప్పటిక్పుడు ఫిల్టర్ అయితే ఎలాంటి సమస్య ఉండదు. ఇది సక్రమంగా పనిచేయకపోవడం వల్ల డీప్ ఫ్రిజ్ లోని వాటర్ గడ్డకట్టుకుపోతాయి.

Written By: Chai Muchhata, Updated On : March 12, 2024 4:50 pm

deep friz

Follow us on

Friz Tips : నేటి కాలంలో చాలా మంది ఇంట్లో రిఫ్రిజిరేటర్ తప్పనిసరిగి ఉటుంది. ఫ్రిజ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉండడం వల్ల గుడిసెలో జీవించేవారు సైతం దీనిని కొనుగోలు చేస్తున్నారనంటే ఆశ్చర్యం వేయక మానదు. ప్రతీ వేసవి రాగానే ఫ్రిజ్ గురించి చర్చ ఉంటుంది. కొందరు అప్పటికీ ఫ్రిజ్ లేనివారు కొత్తగా కొనుగోలు చేస్తారు. ఉన్నవారు ఏదైనా రిపేర్ రాకుండా ముందు జాగ్రత్తతో చెక్ చేయించుకుంటారు. అయితే చాలా మంది ఫ్రిజ్ ఉన్నవారు ఎదుర్కొనే సమస్య ఏంటంటే.. డీప్ ఫ్రిజ్ లో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టుకపోతుంది. దీని వల్ల అందులో ఏవైనా పదార్థాలు ఉంచాలనుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమస్యల తొలగించుకోవాలంటే ఇలా చేయాలి.

ఫ్రిజ్ ఉన్న వారు చాలా మంది దానిని పట్టించుకోరు. ముఖ్యంగా ఫ్రిజ్ ఎంత నీట్ గా ఉంటే అంత మంచిది. లేకుంటే బయటి చెడు వాతావరణం ఫ్రిజ్ లోపలికి వెళ్లి ఆహార పదార్థాలపై పడి అలాగే ఉండిపోతుంది. అలాగే చాలా మంది ఫ్రిజ్ డోర్ ను పదే పదే తీస్తుుంటారు. ఇలా తీయడం వల్ల సాధారణ రోజుల్లో ఎలాంటి సమస్య ఉండదు. కానీ వేసవిలో మాత్రం ఎక్కువగా కూల్ కాకుండా ఉంటుంది. అందువల్ల ఫ్రిజ్ డోర్ ను పదే పదే తీయడం మానుకోవాలి.

ఫ్రిజ్ డోర్ కు ప్రధానంగా దాని మెయిన్ డోర్. ఇది కరెక్ట్ గా ఉంటేనే ఫ్రిజ్ కూల్ అవుతుంది. లేకుండా ఎంత సేపు పదార్థాలు ఉంచినా కూల్ కాకుండా ఉంటాయి. దీంతో ఫ్రిజ్ ఉన్న ఉపయోగం ఉండదు. ఫ్రిజ్ కూల్ కాపోవడానికి ప్రధాన కారణం డోయర్ సరిగ్గా లేకపోవడం. అంటే డోర్ కు ఉండే నల్ల పట్టీలు పాడైపోవడం వల్ల డోర్ సరిగ్గా పడదు. దీంతో ఇందులోకి బయటి గాలి ఎక్కువగా వెళ్తుంది. దీని వల్ల ఫ్రిజ్ కూల్ కాకపోవడమే కాకుండా డీప్ ఫ్రిజ్ లో ఉండే వాటర్ గడ్ట కట్టుకుపోతుంది.

ఫ్రిజ్ లో వాటర్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ వాటర్ ఎప్పటిక్పుడు ఫిల్టర్ అయితే ఎలాంటి సమస్య ఉండదు. ఇది సక్రమంగా పనిచేయకపోవడం వల్ల డీప్ ఫ్రిజ్ లోని వాటర్ గడ్డకట్టుకుపోతాయి. అందువల్ల ఈ సమస్యను వెంటనే గుర్తించి దానిని సరిచేయాలి. లేకుండా అనవసరంగా గడ్డకట్టుకుపోయి ఇబ్బందులు ఏర్పడుతాయి.