Fridge Water Problems: ఎండాకాలం ఎండలకు, సూర్యని ప్రతాపాన్ని తట్టుకోవడం కష్టం గానే ఉంది. ఉదయం 9 గంటలకే ఎండలు మండుతున్నాయి. ఇక నీరు తాగాలంటే చల్లగా ఉంటేనే హాయిగా అనిపిస్తుంది. బిందెలో నీరు అయితే వామ్మో తాగడం కష్టమే. కాస్త కుండలో నీరు, లేదంటే ఫుల్ గా ఫ్రిజ్ లో నీరు ఉంటేనే తృప్తి గా అనిపిస్తుంది. మరి ఈ చల్లని నీరు, ఐస్ వాటర్ తాగడం మంచిదేనా? దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవా అనే అనుమానం మీలో కలిగిందా? మరి ఎందుకు ఆలస్యం ఓసారి మీ డౌట్ క్లియర్ చేసుకోండి.
ఫ్రిజ్ వాటర్ తాగవద్దని చాలా మంది నమ్ముతారు. జీర్ణక్రియ తో సహా వివిధ శరీర విధులకు సపోర్ట్ ఇవ్వడానికి, సాధారణ శరీర ఉష్ణోగ్రతను పాటించడానికి, కణజాలు, అవయవాలను ఆరోగ్యంగా ఉంచడానికి నీరు కచ్చితంగా అవసరం. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. అయితే చల్లని నీరు తాగడం వల్ల శరీరంలో అసమతుల్యతను కలిగిస్తుంది. ముఖ్యంగా తినే సమయంలో ఐస్ వాటర్ తాగకుండా ఉండాలి. లేదంటే చికాకు, గొంతు నొప్పి, ముక్కు మూసుకొని పోవడం వంటి సమస్యలు వస్తాయట.
వేసవి కాలంలో ఐస్ వాటర్ తాగడం వల్ల మరింత ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. జ్వరం, జబులు, దగ్గు వంటి సమస్యలు ఉంటే ఐస్ వాటర్ పూర్తిగా నిషేధించాలి. గోరువెచ్చిన నీరు తాగడం వల్ల సమస్యలు వెంటనే దూరం అవుతాయి అంటారు వైద్యులు. దీనివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ ఐస్ వాటర్ తాగడం వల్ల మరింత ఎక్కువ సమస్యలు తలెత్తుతాయి. అయితే కొందరు పడుకొని, నడుస్తూ కూడా నీరు తాగుతుంటారు.
వాటర్ ను తాగేటప్పుడు కూర్చుని మాత్రమే తాగాలని చెబుతారు నిపుణులు. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావని సలహా ఇస్తున్నారు. ఇక ఐస్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ ను వీలైనంత వరకు దూరంగా పెట్టండి. ఒక మట్టి కుండను తెచ్చుకొని ఉపయోగించండి. చల్లదనం, ఆరోగ్యం రెండూ మీ సొంతం. చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడైనా ఈ చిన్న మార్పు చేసేయండి.