https://oktelugu.com/

Maruthi Car Discount: మారుతి సుజుకీ ఈ కార్లపై భారీ డిస్కౌంట్.. త్వరపడండి

మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయినా మరో కారు జిమ్ని. ఇది మహేంద్ర థార్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు వచ్చింది. ఇప్పటికే దీనికి ఆకర్షితులు కావడంతో కొనుగోల్లు పెరిగాయి. దీనిని రూ.12.74 నుంచి రూ.15.00 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారుపై రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ అందించనున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 8, 2024 / 10:43 AM IST

    maruthi car discount

    Follow us on

    Maruthi Car Discount:  దేశంలో కార్ల ఉత్పత్తి దిగ్గజం మారుతి సుజుకీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ కంపెనీ మరింత సేల్స్ ను పెంచుకునేందుకు తాజాగా బంపర్ ఆఫర్లు ప్రకటించిది. కొన్ని కార్లపై ఏకంగా రూ.1.50 లక్షల వరకు ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. సాధారణంగానే మారుతి కార్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే ఏ కారు అయినా వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ధర తక్కువగా నిర్ణయిస్తారని కొందరి అభిప్రాయం. ఈ తరుణంలో భారీ డిస్కౌంట్లు ప్రకటించడం మరింత ఆకర్షిస్తోంది. మారుతి కంపెనీకి సంబంధించిన ఏ యే కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో ఒకసారి చూద్దాం..

    మారుతి నుంచి ఇప్పటికే రిలీజ్ అయి రోడ్లపై తిరుగుతున్న గ్రాండ్ విటారా 1.5 లీటర్ 3 సిలిండర్ ను కలిగి ఉంది. పెట్రోల్ వేరియంట్ లో ఎస్ యూవీ కారుగా ఇది ఆదరణ పొందుతోంది. ఇది లీటర్ కు 21 నుంచి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.10 నుంచి 19 లక్షల వరకు విక్రయిస్తున్నారు. తాజాగా ఈ కారుపై రూ.58 వేలు, స్ట్రాంగ్ హైబ్రీడ్ వెర్షన్లపై రూ.84 వేల వరకు డిస్కౌంట్లు అందించనున్నారు.

    మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయినా మరో కారు జిమ్ని. ఇది మహేంద్ర థార్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు వచ్చింది. ఇప్పటికే దీనికి ఆకర్షితులు కావడంతో కొనుగోల్లు పెరిగాయి. దీనిని రూ.12.74 నుంచి రూ.15.00 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారుపై రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ అందించనున్నారు. గత ఏడాదిలో ఈ కారు అత్యధిక సేల్స్ ను సొంతం చేసుకుంది.

    ఇదే కంపెనీకి చెందిన ఇగ్నీస్ పై కూడా డిస్కౌంట్ ను ప్రకటించారు. దీనిని రూ.5.84 లక్షల నుంచి రూ.8.11 వరకు విక్రయిస్తున్నారు. దీనిపై రూ.58 వేల డిస్కౌంట్ అందించనున్నారు. మరో పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు బాలెనోను చాలా మంది లైక్ చేశారు. దీనిని రూ.6.66 లక్షల నుంచి రూ.9.88 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దీనిపై రూ.58 వేల డిస్కౌంట్ ను అందించనున్నారు. మారుతి నుంచి ఆకర్షిస్తున్న సియాజ్ కారు పై రూ.53 వేల డిస్కౌంట్ ను అందిస్తున్నారు.