Washing Machine: ఇప్పుడు ఏ పని చేయాలన్నా చాలా సులువు. బట్టలు ఉతకాలన్నా, ఇల్లు తుడవాలన్నా, గిన్నెలు తోమాలన్నా కాస్త డబ్బు ఖర్చు చేస్తే చాలు అన్ని పనులు చకచకా అయిపోతాయి. మరి బట్టలు ఉతకడానికి ఇప్పుడు మనమే గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బట్టలు తీసి మిషన్ లో వేస్తే చాలు. కాస్త ఆరబెట్టి మరీ మనకు బట్టలను అందిస్తుంది వాషింగ్ మిషన్. మరి ఇలాంటి మిషన్ పాడయ్యే సమస్య లేకపోలేదు. మీరు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే రిస్కీ సమస్యల నుంచి బయటపడవచ్చు.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ మిషన్ కు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఎక్కువ కాలం లైఫ్ ఇస్తుంటుంది. అయితే వాషింగ్ మిషన్ లో చాలా మంది ఎక్కువ లోడ్ వేస్తుంటారు. మిషన్ లు వాటి పరిమాణాన్ని బట్టి మాత్రమే ఉంటాయి. ఈ మిషన్ లు 6, 6.5 కిలోల నుంచి మొదలుతాయి. కానీ పరిమాణానికి మించి ఓవర్ లోడ్ చేస్తే మిషన్ త్వరగా పాడవుతుంది.
ఓవర్ లోడ్ వల్ల సరిగ్గా పనిచేయలేదు మిషన్. ఎక్కువ సేపు, గట్టిగా తిప్పాలి కాబట్టి మిషన్ పై లోడ్ పెరుగుతుంది. కొన్ని సార్లు తిరిగే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇక మీరు గనక ఫ్రంట్ లోడ్ మిషన్ ను ఉపయోగిస్తే డోర్ రబ్బరులో కొన్ని సార్లు బట్టలు ఇరుక్కు పోయే ప్రమాదం ఉంది. తలుపు మూయడానికి కష్టం అవుతుంది. దానితో పాటు బట్టలు కూడా పాడవుతాయి. లాండ్రీ గదిలోని మిషన్ లు ఓవర్ లోడ్ వల్ల పేలే సమస్య కూడా వస్తుందట.
డ్రమ్ లో బట్టలు ఉతకడానికి స్థలం లేకపోతే టైట్ గా మారుతాయి. లిక్విడ్ లు కూడా అన్ని భాగాలకు చేరదు. ఫలితంగా బట్టలు శుభ్రంగా ఉండవు. అందుకే ఒకసారి మీరు వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడు దాని కెపాసిటీ తెలుసుకోండి. ఎలా వాడాలి? ఎన్ని కేజీల బట్టలు వేయాలి? ఎలాంటి లిక్విడ్ లు వాడాలి. ఎన్ని రోజులకు ఒకసారి వాషింగ్ మిషన్ ను శుభ్రం చేయాలి. డ్రమ్ క్లీనింగ్ ఎలా వంటివి తెలుసుకొని ఉపయోగిస్తే మీ వాషింగ్ మిషన్ ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది.