Toe Finger Astrology: మనిషి నడిచే తీరును బట్టి వారి లక్షనాలను అంచనా వేస్తారు. చేతి రేఖలను బట్టి చెబుతారు ఇంకా కొందరు కాలి వేళ్లను బట్టి కూడా వారు ఎలాంటి వారనే సంగతి బయటపెడతారు. అమ్మాయిల కాలి వేళ్లను చూసి కూడా వారు ఎలాంటి వారనే విషయం తెలిసిపోతుంది. వారిని పెళ్లి చేసుకుంటే ఏ రకమైన ఫలితాలు వస్తాయో కూడా చెబుతారు. కాలి వేళ్లు ఎలా ఉంటే ఎలాంటి గుణాలు ఉంటాయో తెలుసుకుందాం.
అమ్మాయిల కాలి బొటన వేలి కంటే పక్కన ఉన్న వేలు పొడుగు ఎక్కువగా ఉంటే వారు చాలా తెలివైన వారుగా ఉంటారు. మంచి నైపుణ్యంతో పని చేస్తారు. మిగతా వేళ్ల కంటే బొటన వేలు పొట్టిగా ఉంటే పనులు సునాయాసంగా చేస్తారు. బొటన వేలు పక్కన ఉన్న వేలు మిగతా వాటికంటే పొడవుగా ఉంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయట.
కాలి రెండో వేలు అన్ని వేళ్ల కంటే పొట్టిగా ఉంటే కలివిడిగా ఉంటారు. అందరితో కలిసిపోతుంటారు. కాలి మొదటి మూడు వేళ్లు సమానంగా ఉండి చివరి రెండు వేళ్లు చిన్నగా ఉంటే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. కాలి వేళ్లలో నాలుగు సమానంగా ఉండి చివరి వేలు చిన్నగా ఉన్న అమ్మాయిలు కుటుంబానికి ఆసరాగా ఉంటారు.
కాలి వేళ్లలో నాలుగు సమానంగా ఉండి చివరి వేలు చిన్నగా ఉంటే ఆ అమ్మాయి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. అన్ని వేళ్లు పొడుగుగా ఉండి నాలుగో వేలు పొట్టిగా ఉంటే ఆ అమ్మాయి కుటుంబంతో మంచి సంబంధాల పట్ల పెద్ద ఆసక్తి చూపించదు. ఇలాంటి గుర్తులు అమ్మాయిల లక్షణాలు అంచనా వేస్తుంటారు.