Tangedu Benefits: మనకు ఆయుర్వేదంలో ప్రతి మొక్కను వాడతాం. బతుకమ్మ పండుగలో ముఖ్యమైన పువ్వుగా పిలవబడే తంగేడు గురించి అందరికి తెలుసు. దీంతోనే బతుకమ్మ తయారు చేస్తారు. కానీ తంగేడులో ఎన్నో రోగాలను నయం చేసే గుణం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తండేడును వాడుకుని మన దేహంలో ఎదురయ్యే పలు రోగాలను దూరం చేసుకునే శక్తిని తెచ్చుకోవచ్చని తెలుసుకోవాలి.
గుండె దడతో ఇబ్బంది పడే వారికి తంగేడు విత్తనాలు సేకరించి బాగా వేయించి చూర్ణంలా చేసుకుని దీన్ని నీటిలో కలుపుకుని రోజు తీసుకుంటే గుండె దడ తగ్గుతుంది. నీరసం, కళ్లు తిరగడం లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి. సంతాన లేమికి కూడా ఇది మందులా పనిచేస్తుంది. తంగేడు చిగుళ్లను తీసుకుని దానికి రెండు చిటికెల గవ్వ పరికల బూడిదను కలుపుకుని చిన్న గోలీలుగా చేసుకుని ఉదయం పరగడుపున తింటే సంతానం కలిగే అవకాశం ఉంటుంది.
డయాబెటిస్ తో బాధపడే వారికి తంగేడు పువ్వు తీసుకుని బాగా మరిగించి తరువాత చల్లార్చి వడకట్టి అందులో ఒక స్పూన్ తేనె కలుపుకుని రోజు ఉదయం పరగడుపున తాగితే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. చిగుళ్ల సమస్యతో బాధపడే వారు తంగేడు కొమ్మతో పళ్లు తోముకుంటే గట్టిపడి సమస్యలు లేకుండా ఉంటుంది. స్త్రీలలో వచ్చే బహిష్టు సమస్యలు దూరం చేసుకోవాలంటే దీని బెరడును దంచి ఒక స్పూన్ పొడిని ఆవు మజ్జిగతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
ఇలా మనకు ప్రకృతిలో లభించే తండేడుతో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండటం వల్ల దీన్ని వాడుకుని మన రోగాలను దూరం చేసుకోవచ్చు. తంగేడు పువ్వులు, ఆకులు, విత్తనాలు, బెరడు కూడా మందులా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో తంగేడుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే దీన్ని వాడుకుని మన రోగాలను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి.