Electric kettle: ఒకప్పుడు నీళ్లు వేడి కావాలంటే కట్టెల పొయ్యి మీద వేడి చేసుకునే వారు. కానీ టెక్నాలజీ మారిన తర్వాత అందరూ ఎలక్ట్రిక్ కెటిల్ లాంటివి వాడేస్తున్నారు. కేవలం నీటిని వేడి చేసుకోవడానికి మాత్రమే కాదండోయ్.. ఆహార పదార్థాలను రెడీ చేసుకోవడానికి కూడా ఇలాంటి ఎలక్ట్రిక్ కెటిల్ ను వాడేస్తున్నారు. ఇలా సింపుల్ గా ఎలాంటి కష్టం లేకుండా పని అయిపోతోంది కాబట్టి దీనికి వంటింట్లో ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు.

అయితే వీటి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం త్వరగా పాడైపోతాయని చెబుతున్నారు నిపుణులు. వీటిని వాడిన తర్వాత సరిగ్గా క్లీన్ చేయకపోతే మాత్రం పనిచేయవని చెబుతున్నారు. మరి ఇన్ని రకాలుగా పనిచేసి పెడుతున్నీ ఎలక్ట్రిక్ కెటిల్‌ను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం కెటిల్ ను వాడుతున్నప్పుడు దాని సైజును బట్టి దాంట్లో నీటిని పోసి వేడి చేసుకోవాలి. చాలామంది కెటెల్ నిండా నీళ్లు పోస్తారు.
Also Read: తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన ఘనుడు ‘ఎన్టీఆర్’ !
అలాంటప్పుడుఅవుట్‌లెట్ రంధ్రాల్లోంచి నీరు దొర్లిపోతాయి. ఇలా దొర్లిన నీళ్లు కాస్తా కెటిల్ లోపల ఉన్న మెషిన్లలోకి వెళ్లి పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఎక్కువగా చేసే పొరపాటు ఏంటంటే.. నీటిని వేడి చేసిన తర్వాత వాటిని అందులోనే ఉంచడం.. ఇలా చేస్తే కెటిల్‌లో అంచులలో కట్టులాగా తెల్లటి పొర జిడ్డులాగా తయారవుతుంది. కాబట్టి వేడి చేసిన నీటిని అందులో ఉంచొద్దు. ఇక నీళ్లు మరుగుతున్నప్పుడు ఆవిరి బయటకు వస్తుంది.

వేడి పొగలు దగ్గరలో ఉన్న ఏవైనా ఫర్నిచర్ మీద లేకపోతే ప్లాస్టిక్ వస్తువుల మీద పడితే అవి పాడైపోతాయి. కాబట్టి దగ్గరలో ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఇక స్విచ్ బోర్డుల లాంటివి వేడి పొగలు వెళ్లేలా ఉంచకూడదు. అది చాలా ప్రమాదం. ఇక చిన్న పిల్లలకు అందకుండా ఉంచుకోవాలి. ఇక దీన్ని వాడిన తర్వాత నీళ్లతో పాటు వెనిగర్ సరైన పద్ధతిలో తీసుకొని మరిగించి కొద్దిసేపు వదిలేయాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో క్లీన్ చేసుకుంటే సరి. ఇక కెటిల్ ను బయటి సైడులోనూ తడిగుడ్డతో తుడిచి మాత్రమే క్లీన్ గా ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఎప్పటికీ కెటిల్ పాడైపోకుండా ఉంటుంది.
Also Read: చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులో హోయలు పోతున్న భామలు..!
[…] Also Read: ఎలక్ట్రిక్ కెటిల్ పాడైపోకుండా ఉండా… […]