
Junior Soundarya: మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచం లో 7 మంది ఉంటారు అంటే చాలా మంది నమ్మరు.కానీ కొంతమందిని చూసిన తర్వాత నమ్మక తప్పదు.నిన్నటి తరం హీరోయిన్స్ లో తెలుగు, హిందీ , తమిళం , మలయాళం అని తేడా లేకుండా ప్రతీ భాషలోనూ అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించి మహానటి సావిత్రి మళ్ళీ పుట్టింది అని అనిపించుకున్న సౌందర్య దురదృష్టం కొద్దీ 2004 వ సంవత్సరం లో హెలికాప్టర్ ప్రమాదానికి గురై చనిపోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికీ ఆమెని గుర్తు చేసుకుంటే మన కంటి నుండి నీళ్లు ధారలాగ కారిపోతాది.అంత గొప్ప నటి ఆమె, అయితే ఇప్పుడు ఆమె మళ్ళీ పుట్టిందా అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.ఎందుకంటే అచ్చు గుద్దినట్టు ఆమె పోలికలతోనే సోషల్ మీడియా లో ఒక అమ్మాయి హల్చల్ చేస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే ఇంస్టాగ్రామ్ లో చిత్ర అనే పేరు మీద ఒక అమ్మాయి ఉంది.ఎల్లప్పుడూ రీల్స్ చేస్తూ ఈమె టాప్ సెలబ్రిటీ గా మారిపోయింది.ఆమె ముఖం ని చూసి సౌందర్య కాదు అంటే నమ్మడం చాలా కష్టం, అంత పోలికలతో మ్యాచ్ చేస్తుంది ఈమె.తిరుపతి కి చెందిన ఈ అమ్మాయి ఇప్పుడు నెటిజెన్స్ ని సౌందర్య పోలికలతో షాక్ కి గురి చేస్తుంది.ఎవరైనా ఈమె చేసిన ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తే సౌందర్య రీల్స్ కూడా చేసిందా..? ఆరోజుల్లో సోషల్ మీడియా అసలు లేదు కదా,ఇది ఎలా సాధ్యం అనే అనుమానం రాక తప్పదు.

ఇక రీల్స్ లో ఈమె అభినయం కూడా సౌందర్య కి ప్రింట్ గుద్దినట్టు అనిపిస్తాది.ఇంకా ఈమెని ఏ డైరెక్టర్ కానీ, హీరో కానీ చూసి ఉండరు, ఒకవేళ చూస్తే మాత్రం ఈమెని సినిమాల్లోకి తీసుకోకుండా ఉండలేరు.ఎందుకంటే వెండితెర మీద సౌందర్య ని మిస్ అవుతున్నాం అని బాధపడుతున్న కోట్లాది మంది అభిమానులు ఆమెని చిత్ర లో చూసుకోవచ్చు.మరి ఏ డైరెక్టర్ ఈ అమ్మాయిని గుర్తిస్తారో చూడాలి.