Homeలైఫ్ స్టైల్Flipkart Bumper Offer: ఫ్లిప్ కార్ట్ బంఫర్ ఆఫర్.. అత్యధిక ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్...

Flipkart Bumper Offer: ఫ్లిప్ కార్ట్ బంఫర్ ఆఫర్.. అత్యధిక ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ వాచ్ అత్యంత తక్కువ ధరకే.. త్వరపడండి..

Flipkart Bumper Offer: పండుగలు, ప్రత్యేక రోజుల్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. అయితే వీటితో సంబంధం లేకుండా తమ సేల్స్ పెంచుకునేందుకు కొన్ని కంపెనీలు డిస్కౌంట్ తో పాటు తక్కువ ధరకే వస్తువులను విక్రయిస్తుంటాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Flipcart ఓ డివైజ్ ను అత్యంత తక్కువ ధరకే అందిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 24 నుంచి 29 వరకు Flipcart Black Friday Sale 2024 పేరిట కొన్ని వస్తువులపై భారీ స్థాయిలో తగ్గింపు ధరను ప్రకటించింది. వీటిలో స్మార్ట్ వాచ్ ఆకర్షిస్తోంది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ వాచ్ వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ఈ డివైజ్ ను కొనాలని అనుకునేవారు ఈ సేల్స్ లో కొనుగోలు చేయడం ద్వారా అతి తక్కువ ధరకే పొందవచ్చు. ఇంతకీ ఈ డివైజ్ ధర ఎంత ఉందంటే?

Fire Boltt Ninja Calling Pro Pluc Smartwatch ను కొనుగోలు చేసేవారికి ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు ధరను ప్రకటించింది. నవంబర్ 29 వరకు దీనిని ఆన్ లైన్ లో రూ.1,299 కే కొనుగోలు చేయొచ్చు. మిగతా స్మార్ట్ వాచుల్లో కంటే ఇందులో అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇది ఏఐ వాయతో పనిచేస్తుంది. ప్రముఖ బ్యాంకులైన HDFC, Axic Bank, Bank Of Baroda, IDFC బ్యాంకు కార్డుల ద్వారా దీనిని కొనుగోలు చేస్తే మరో 10 శాతం డిస్కౌంట్ ను కూడా పొందచ్చు. అలాగే యాక్సిక్ కార్డు తో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వనున్నారు. అయితే ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బోల్ట్ నింజా ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే.. 1.83 హెచ్ డి డిస్ ప్లే ను కలిగి ఉంది. 240×284 పిక్సల్ రిజల్యూషన్ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ నుంచే కాల్ చేసుకోవచ్చు. దీనికి బ్లూటూత్ కనెక్టివిటి కూడా ఉంది. 120 స్పోర్ట్ మోడ్ ఆప్షన్ ఇందులో ఉంది. ఇందులో అదనంగా హెల్త్ ట్రాకర్ యాప్ నుకూడా ఉంచారు. ఇది హార్ట్ రేట్ ట్రాకర్, స్లీప్ మానిటర్, డ్రింక్ రిమైండర్ వంటి అద్భుత ఫీచర్లను కలిగి ఉంది. వెదర్ కు సంబంధించిన అప్డేట్ ను కూడా అందిస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఆరు రోజుల వరకు వాడుకోవచ్చు. అలాగే 15 రోజుల పాటు స్టాండ్ బై ని కూడా అందిస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ ద్వారా మొబైల్ లోని కెమెరా, మ్యూజిక్ ను కూడా కంట్రోల్ చేయవచ్చు. అలాగే డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీని కూడా ఇందులో నుంచే తెలుసుకోవచ్చు. ఇందులో ఇన్ బిల్ట్ గేమ్స్ కూడా ఉన్నాయి. అనేక వాచ్ ఫేస్ లను కలిగి ఉన్న ఈ వాచ్ IP67 రేటుతో డస్ట్, వాటర్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ వాచ్ అత్యంత తక్కువ ధరకే ఇవ్వడంతో దీనిని వెంటనే కొనుగోలు చేయొచ్చు.
.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular