Homeఎడ్యుకేషన్Ticket Collector : టికెట్ కలెక్టరా మజాకా.. రూ.1.03 కోట్లు జరిమానాల వసూళ్లు

Ticket Collector : టికెట్ కలెక్టరా మజాకా.. రూ.1.03 కోట్లు జరిమానాల వసూళ్లు

Ticket Collector : విధి నిర్వహణ అందరికి కత్తిమీద సామే. కానీ కొందరు తమదైన శైలిలో చేస్తుంటారు. మరికొందరు చిందరవందర చేస్తుంటారు. పనులు అందరు చేస్తారు. పనులు చేయడంలో ప్రత్యేకత కలిగిన వారు కొందరుంటారు. వారు తమ పనితీరుతో ఎక్కడికో వెళ్తుంటారు. బద్ధకస్తులు మాత్రం అక్కడే ఉంటారు. వృత్తిని దైవంగా భావిస్తే ఇబ్బందులు రావు. అది ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేటు ఉద్యోగమైనా చేసే తీరులో ఉంటుంది. అద్భుతంగా పనిచేస్తే అందరు ప్రశంసిస్తారు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతుంటారు.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే రైల్వే వ్యవస్థలో టికెట్ కలెక్టర్లుంటారు. అందరు నామ్ కే వాస్తేగా చేస్తున్నా వారిలో ఓ ఆడ టికెట్ కలెక్టర్ మాత్రం తనదైన శైలిలో విధులు నిర్వహిస్తోంది. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే కచ్చితంగా వదలదు. వారి నుంచి జరిమానా లాగాల్సిందే. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 1.03 కోట్లు జమ అయ్యాయంటే ఆమె వృత్తిలో ఎంత నిబద్ధతగా ఉంటుందో అర్థమవుతుంది. ఇంతకీ ఆమె పేరోంటో తెలుసా? రోస్ లిన్ ఆరోగ్య మేరీ.

ఆమె ఉద్యోగంలో చేరిన రోజే వృత్తిలో రాణించాలంటే కఠినంగా ఉండక తప్పదని నిర్ణయించుకుంది. విధి నిర్వహణలో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా రైల్వేకు ఆదాయం సమకూరుస్తోంది. తీసుకునే జీతానికి న్యాయం చేస్తోంది. టికెట్ కలెక్టర్ అయినా ఆమె క్షేత్ర పర్యటనకు వెళితే దొంగలకు చెమటలు పట్టాల్సిందే. వారు ఎంతటి వారైనా సరే వారి నుంచి జరిమానా కట్టే వరకు ఊరుకోదు. దీంతో ఆమె వృత్తికి న్యాయం చేస్తూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నారు.

వృత్తిలో నిబద్ధతగా ఉన్న ఆమెకు ప్రశంసలు దక్కుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారం కూడా అందుకుంది. ఆమె ఫీల్డ్ లో ఉందంటే సింహస్వప్నమే. దొంగలకు భయమే. అలాంటి రోస్ లిన్ తన అకుంఠిత దీక్ష, పట్టుదలతో రాణిస్తోంది. జీవితంలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగేందుకు బాటలు వేసుకుంటోంది. ఇప్పటికే ఉద్యోగుల చేత శభాష్ అనిపించుకున్న ఆమె త్వరలో పదోన్నతి పొంది ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తుందని చెబుతున్నారు. ఇలా ఆమె తన ఉద్యోగంలో ఇప్పటికే ఎన్నో రివార్డులు అందుకుంది.

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular