Vijayawada: విజయవాడకు వంగవీటి పేరు పెడతారా?

Vijayawada: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయి. దీనిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో నూతన జిల్లాల ఏర్పాటుకు జగన్ సంకల్పించారు. దీంతో ప్రతిపక్షానికి మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో సర్కారు తన పని తాను చేసుకుంటూ పోతోంది. నూతన జిల్లాల ఏర్పాటులో మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించనున్నట్లు చెబుతోంది. దీంతో పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. అయితే […]

Written By: Srinivas, Updated On : January 28, 2022 5:19 pm
Follow us on

Vijayawada: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయి. దీనిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో నూతన జిల్లాల ఏర్పాటుకు జగన్ సంకల్పించారు. దీంతో ప్రతిపక్షానికి మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో సర్కారు తన పని తాను చేసుకుంటూ పోతోంది. నూతన జిల్లాల ఏర్పాటులో మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించనున్నట్లు చెబుతోంది. దీంతో పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి.

Vijayawada be named Vangaveeti

అయితే మచిలీపట్నం కు ఎన్టీఆర్ పేరు పెట్టారనే విషయంపై టీడీపీలో సైతం ఎలాంటి స్పందన రావడం లేదు. దీనిపై మంత్రి పేర్ని నాని చెబుతూ పాదయాత్ర సమయంలో జగన్ కు ఎన్టీఆర్ పెట్టాలనే వినతులువచ్చిన సందర్భంలో దానికి ఆయన పేరు పెట్టాలని భావించినట్లు చెబుతున్నారు. ఇది టీడీపీ వారికి మాత్రం మింగుడుపడటం లేదు. తమ ప్రియతమ నేత పేరు పెట్టుకుని ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు విజయవాడకు వంగవీటిరాధ పేరు పెట్టాలని డిమాండ్ వస్తే చూస్తామని చెప్పారు. ఎక్కువ మంది ప్రజల నుంచి డిమాండ్ వస్తే ఆలోచిస్తామని చెబుతున్నారు. దీంతో జిల్లాల ఏర్పాటు వ్యవహారంలో సైతం రాజకీయాలు సాగుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి నూతన జిల్లాల ఏర్పాటుతో వైసీపీ తన మాట నిలబెట్టుకుంటోంది. టీడీపీకి మాత్రం నచ్చడం లేదు.

Also Read: కొత్త జిల్లాలతో ఏపీ సర్కారుకు త‌ల‌నొప్పులు.. అలా జ‌రిగితే తెలంగాణ లాగే ఇబ్బందులు?

మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పైకి ఏమి అనకున్నా లోపల మాత్రం తమ పలుకుబడికి దెబ్బ కొట్టేలా వైసీపీ వ్యూహం రచిస్తోందని కుళ్లుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా వైసీపీ మాత్రం ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసి అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంత తొందర అవసరమా అని టీడీపీ వాదిస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అధికార పార్టీ చెబుతోంది. రాష్ర్టంలో రాబోయే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు మరింత మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీల్లో విభేదాలు ఎక్కువగా పొడచూపే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Also Read: ఏపీ రావణకాష్టంలా మారుతోందా?

 

Tags