Fan Cooling Tricks: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 కంటే ఎక్కువ సెల్సియస్ డిగ్రీలు నమోదు కావడంతో వాతావరణం వేడెక్కుతోంది. మధ్యాహ్నం మొత్తం వేడి వాతావరణం ఉండగా.. సాయంత్రం ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఫ్యాన్ గాలి ఏ మాత్రం సరిపోదు. దీంతో కొందరు కూలర్లు ఏర్పాటు చేస్తుండగా.. కాస్త డబ్బు ఉంటే ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిని కొనలేని వారు సైతం ఫ్యాన్ గాలిని కూడా ఏసీగా మార్చుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఎండాకాలంలో సాధారణంగా ఫ్యాన్ గాలి వేడిగానే వస్తుంది. అయితే ఈ గాలి చల్లగా రావాలంటే చిన్న పని చేయాలి. ఒకవేళ మీది టేబుల్ ఫ్యాన్ అయితే దీని ముందు ఒక ట్రే లో ఐస్ క్యూబ్ తీసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ ను ఫ్యాన్ గాలి తగిలేలా ఉంచాలి. దీంతో ఈ ఫ్యాన్ గాలి ఐస్ క్యూబ్ కు తగిలి చల్లటి గాలి వస్తుంది. ఏసీ కంటే కూడా ఈ గాలి చాలా చల్లగా ఉంటుంది. మీ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉన్నట్లయితే ఈ ట్రిక్ ప్లే చేయొచ్చు. ఒక తడి గుడ్డను తీసుకోవాలి. ఇది కాటన్ ది అయి ఉండాలి. దీనిని సీలింగ్ ఫ్యాన్ కింద ఉంచడం వల్ల దాని నుంచి చల్లటి గాలి వస్తుంది. దీంతో గది అంతా చల్లబడుతుంది. అలా కాకుండా ఒక దుప్పటి మొత్తం తడిపి కూడా ఇలా ఉంచడం వల్ల చల్లదనాన్ని అందిస్తుంది.
మధ్యాహ్న సమయంలో బయట ఉండే వేడి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీలు, ద్వారాలు మూసివేయడమే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో వేడి వాతావరణం ఇంట్లోకి వచ్చి గది అంతా హీట్ ఎక్కుతుంది. అయితే సాయంత్రం సమయంలో ఇంటి గదికి సంబంధించిన డోర్లు ఓపెన్ చేయడం వల్ల కాలనీ వాతావరణ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఫ్యాన్ ను ఆన్ చేసుకుంటే చల్లగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో సహజంగానే గది వేడెక్కుతుంది. ఇలాంటి సమయంలో నేలపై నీళ్లను చల్లుతూ ఉండాలి. లేదా సీలింగ్ పై కూడా నీళ్లను చిలకరించాలి. ఇలా చేయడం వల్ల ఫ్యాన్ గాలి చల్లగా మారే అవకాశం ఉంటుంది.ఈ విధంగా ఇంట్లో ఉన్న ఫ్యాన్ తోనే ఏసీ లాగా మార్చుకొని చల్లటిని గాలిని పొందవచ్చు.