Thalapathy Vijay: తమిళనాడు లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ లో పాల్గొనడం కోసం ఇతర దేశాల నుండి , ఇతర రాష్ట్రాల నుండి తమిళియన్స్ నేడు తమిళనాడు కి చేరుకుంటున్నారు. యువత అయితే భారీ స్థాయిలో ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ముఖ్య కారణం తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) TVK పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతుండడం వల్లే. నిండు చంద్రుడు ఒకవైపు , చుక్కలు ఒకవైపు అన్నట్టుగా, తమిళనాడు లో అన్ని రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తుంటే , విజయ్ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాగానే ఈయన కూడా రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాడు. ఒకటి త్రిచి ఈస్ట్ నియోజకవర్గం కాగా , మరొకటి పెరంబూర్ నియోజకవర్గం.
ఈ రెండిట్లో విజయ్ ఏది గెలుస్తాడు?, రెండిట్లో గెలుస్తాడా?, లేదా రెండిట్లో ఓడిపోతాడా?, లేదా ఒక దాంట్లో గెలిచి, ఒక దాంట్లో ఓడిపోతాడా అని తమిళనాడు లో బెట్టింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో జరుగుతున్నాయి. రీసెంట్ గా జరిగిన సర్వేలు మొత్తం విజయ్ కి 2 నుండి 6 స్థానాలు వస్తాయని , విజయ్ పోటీ చేయబోయే రెండు స్థానాల్లోనూ గెలుస్తాడని అంటున్నాయి. కానీ 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి ఇలాగే చెప్పారు. పవన్ కళ్యాణ్ కచ్చితంగా భీమవరం నుండి గెలుస్తాడని , గాజువాక లో ఓడిపోతాడని అన్నారు, కానీ చివరికి ఆయన రెండు స్థానాల్లోనూ ఓడిపోవాల్సి వచ్చింది. ఇక్కడ విజయ్ కి కూడా ఈ రెండు స్థానాల్లో గెలుపు అంత తేలికైన విషయం కాదని గ్రౌండ్ నుండి అందుతున్న రిపోర్ట్స్. ఈ రెండు స్థానాల్లో త్రిముఖ పోరు వేరే లెవెల్ లో ఉంటుందని , ఎవరి గెలిచినా మెజారిటీ చాలా స్వల్పంగానే ఉంటుందని అంటున్నారు.
విజయ్ ఒకవేళ గెలిస్తే 3 నుండి 7 వేల మెజారిటీ తో గెలుస్తాడని , ఒకవేళ ఓడిపోయిన కూడా అదే రేంజ్ లో మెజారిటీ ఉంటుందని అంటున్నారు. రెండు స్థానాల్లో అంతటి కష్టమైన పోటీ ఉన్నందున, విజయ్ గెలుపు ఖాయం అని చెప్పడం చాలా కష్టమని, ఎలెక్షనీరింగ్ లో మూడు పార్టీలు మ్యానేజ్ చేసుకునే దానిని బట్టే విజయ్ గెలుపు ఓటమి నిర్ణయించబడుతుందని అంటున్నారు. విజయ్ పోటీ చేస్తున్న రెండు స్థానాలు DMK కి కంచు కోటలు వంటివి. రెండిట్లో ఏ ఒక్కటి గెలిచినా అది చరిత్రే అవుతుంది. పీక్ సినీ కెరీర్ ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారంటే , కచ్చితంగా ఎదో ఒకటి జనాలకు సేవ చెయ్యాలనే మంచి మనస్తత్వం ఉందని అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగన్మే సీఎం ని చేసేయాలి అనే రూల్ లేదు , కనీసం ఎమ్మెల్యే గా గెలిపించి అసెంబ్లీ కి పంపితే చాలు అంటూ సోషల్ మీడియా విజయ్ కి సపోర్టు చేస్తున్నారు నెటిజెన్స్.