Parenting Tips: నేటి కాలంలో పిల్లలను పెంచడం ఒక ప్రయోగం లా మారిపోయింది. ఎందుకంటే సమాజంలో ఉన్న వాతావరణానికి అనుగుణంగా పిల్లలను పెంచకపోతే వారు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి పిల్లవాడికి మొదటి గురువు తల్లిదండ్రులే. తల్లిదండ్రులే వారికి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను పరిచయం చేయాలి. అవి విద్యాబుద్ధులు కావచ్చు.. జీవిత సత్యాలు కావచ్చు.. డబ్బు విషయం కావచ్చు.. వీటిలో డబ్బు విషయాన్ని గురించి మాట్లాడితే.. పిల్లలకు డబ్బు విషయంలో మెలకువలు నేర్పించాలి. ఎందుకంటే వారు డబ్బు విషయంలో తొందరగా అట్రాక్ట్ అయిపోతుంటారు. ఈ క్రమంలో వారికి డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో.. ఎలా పొదుపు చేయాలో నేర్పించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం..
Also Read: భోజనం చేసిన తర్వాత ఈ పనులు చేస్తే ఆరోగ్యం అటకెక్కినట్లే..!
కొంతమంది ధనవంతులు డబ్బు విషయంలో పకడ్బందీగా ప్రణాళికతో ఉంటారు. వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా పొదుపు చేయాలి? ఎలాంటి పెట్టుబడులు చేయాలి? అనే విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. ఇదే విషయాన్ని తమ పిల్లలకు చెప్పడం వల్ల భవిష్యత్తులో వారు కూడా అదే ఫాలో అవుతారు. అయితే అందరి ఇళ్లల్లో ఈ పరిస్థితి లేకపోయినా వారి ముందు డబ్బులు పొదుపు చేయడం.. తక్కువగా ఖర్చు చేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులను ఫాలో అవుతూ పిల్లలు కూడా అదే చేస్తారు.
తల్లిని మించిన దైవం లేదు అని అంటారు. అలాగే తల్లి కూడా పిల్లలకు గురువు లాగా పలు సందర్భాల్లో ఉంటుంది. డబ్బు విషయంలో కూడా తల్లి ఎలా చేస్తే పిల్లలు అలాగే ఉంటారని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. అంటే ఇంటి యజమాని తనకు ఇచ్చిన డబ్బును ఏ విధంగా ఖర్చు పెడతారో? పిల్లలు గమనిస్తూ ఉంటారు. కొందరు గృహిణులు తమకు వచ్చిన ఆదాయాన్ని పోపుల డబ్బాలో.. లేదా ఇతర సేవింగ్స్ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని పిల్లలకు చెబుతూ ఉండాలి. అలాగే ఏ విషయంలో ఖర్చు చేయాలి? ఎలాంటి అవసరాలుకు వెచ్చించాలి? అనే విషయాన్ని కూడా వారికి నేర్పిస్తే భవిష్యత్తులో వారు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తారు.
ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో.. అనవసరం లేని వస్తువుల విషయంలో కంట్రోల్ ఉండడం లేదు. అయితే దీనిపై పిల్లలకు చిన్నప్పుడే చెప్పించాలి. అంటే డబ్బు వృధా ఖర్చు చేస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏంటి? ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అనే విషయాలు వారికి చెబుతూ ఉండాలి. అంతేకాకుండా ఎలాంటి ఖర్చులకు దూరంగా ఉండాలి? అనే వాటిపై కూడా నిత్యం చర్చిస్తూ ఉండాలి.
Also Read: ధనవంతులు అవ్వాలంటే ఈ మైండ్‌సెట్ మార్చుకోవాలి!
భవిష్యత్తులో అందరికీ అనుకూలమైన ఉద్యోగాలు, వ్యాపారాలు ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో డబ్బు ఎక్కువగా సంపాదించడం కోసం కష్టపడడం కంటే.. వచ్చిన ఆదాయాన్ని ప్రణాళిక కొద్దీ ఖర్చు చేస్తూ.. సేవింగ్స్ చేయడం అలవాటు చేస్తే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.