Jagdeep Dhankhar Inside Story : రాజకీయాలు బహు విచిత్రంగా ఉంటాయి. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికీ అందదు. అసలు ప్రతిపక్షాలకు మింగుడు పడని విధంగా రాజ్యసభలో దడదడలాడించే ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ వైఖరి మారింది. అదే ప్రతిపక్షం జగదీప్ రాజీనామా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం విడ్డూరం..
రెండు మూడు నెలల్లోనే జగదీప్ ధంకర్ ప్రతిపక్షాలకు దగ్గరయ్యాడు. బీజేపీ చెప్పినట్టుగా వినడం లేదు. ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇస్తూ బీజేపీ బిల్లులకు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇటీవల నెలరోజుల క్రితం నుంచి ఖర్గేతో జగదీప్ సమావేశమయ్యారు. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ తోనూ భేటి అయ్యారు. జగదీప్ మొదటి నుంచి వివాదాస్పదుడు. వార్తల్లో నిలిచే వ్యక్తిగా ఉండేవాడు. బెంగల్ గవర్నర్ గా జగదీప్ స్ట్రీట్ ఫైటర్ గా మమత బెనర్జీతో తలపడ్డాడు.
ఈ ఊపులోనే ఉప రాష్ట్రపతిగా జగదీప్ ను మోడీ సర్కార్ నియమించింది.అయితే ఆయనకు స్వేచ్ఛ ఎక్కువైంది. కోర్టులు, న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నేషనల్ జ్యూడిషిరీ కమిటీని పునరుద్దరించాలని జగదీప్ ప్రశ్నించాడు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టడం లేదని నిలదీశాడు.
జగదీప్ ధంకర్ మరో సత్యపాల్ మాలిక్ గా మారుతాడా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.