Short Temper: ప్రపంచం మీద ఎన్నో రకాల మనుషులు ఉంటారు. అందరూ ఒకే జాతికి చెందిన వారు కావొచ్చు. కానీ మనుషుల మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయి. ఇద్దరు మనుషులు పక్కనే ఉన్నా వారి అభిప్రాయాలు, ఆచారాలు, వ్యవహారాల్లో తేడాలు ఉంటాయి. అయితే కొందరి మనస్తత్వాలు మృదువుగా ఉంటాయి. వీరి ప్రవర్తనతో ఎదుటివారికి హాయిగా ఉంటుంది. కానీ మరికొందరి చేష్టల వల్ల ఎదుటి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా షార్ట్ టెంపర్ ఉన్న వారితో ఎంత దూరం ఉంటే అంత మంచిది అని అనుకుంటారు. వీరు తమదే ఎక్కువ అన్నట్లు ఫీలవుతూ ఎదుటివారిని చిన్న చూపు చూస్తుంటారు. కానీ ఇలాంటి వారి వల్ల మేలే జరుగుతుందనే విషయం తెలుసా? అదెలాగంటే?
చాలా మంది వ్యక్తులు కొందరి వ్యక్తుల ప్రవర్తనతో ఇబ్బందులు గురవుతన్నామని చెబుతూ ఉంటారు. వారికి షార్ట్ టెంపర్ ఎక్కువ.. అని నిందిస్తూ ఉంటారు. వీరితో జాగ్రత్తగా ఉండాలని చెబుతూ వారిని చెడ్డవారిగా గుర్తిస్తూ ఉంటారు. కానీ షార్ట్ టెంపర్ ఉన్న వారి వల్ల ఇతరులకు మేలు జరుగుతుందని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. షార్ట్ టెంపర్ ఉన్న వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న కష్టాన్ని ఓర్చుకోరు. ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించకుండా మాట అనేస్తారు. ఎదుటివారిని మాటలతో కష్టపెడుతూ ఉంటారు. అలాగే కొందరు తమకు చిన్న కష్టం ఏర్పడితే వెంటనే ప్రదేశం అని కూడా చూడకుండా వెంటనే కక్కేస్తారు.
ఇలాంటి వారి వల్ల మేలు జరగడానికి కారణం ఏంటంటే.. వారు ఎదుటి వారి గురించి మనసులో ఏదీ ఉంచుకోరు. ఇతరులపై కోపం ఉంటే ఏమాత్రం మైండ్ లో ఉంచుకోకుండా వెంటనే అక్కడే అని వారి మీద ఉన్న కసిని తీర్చుకుంటారు. ఆ తరువాత వారికి ప్రత్యర్థులపై కోపం ఉండందు. వారి గురించి కూడా ఆలోచించరు. అందువల్ల ఇలాంటి వారి వల్ల తాత్కాలికంగా కాస్త కష్టం అనిపించినా.. భవిష్యత్ లో వారి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భవిష్యత్ గురించి వారు అస్సలు ఆలోచించరు. ఆక్షణంలో వారు అనుకున్నది చేస్తారు. తమకు కావాల్సిన పనులు కుదరకపోతే ఎలాగైనా చేయించుకోవడానికి ఆందోళన చెందుతారు.
కొందరు షార్ట్ టెంపర్ ఉన్నవాళ్లు తాము గెలవడానికి ఇతరులకు ఇబ్బందులకు గురి చేస్తారు. అయితే వారు ఏ విధమైన స్కెచ్ లు వేస్తారో..ముందే తెలిసిపోతుంది. దీంతో వారిని ఓడించడం చాలా సులభం. వీరి ప్రవర్తన నీళ్లపై దెబ్బ లాగా ఉంటుంది. దీంతో ఆ చప్పుడుతో వారి బలం ఎంతో పసిగట్టేయవచ్చు. అయితే కొందరు ఆవేశం ఎక్కువగా ఉన్న వారు ఎదుటివారిపై దాడి చేయడానికి వెనుక ఆడరు. ఇలాంటివారికి మాత్రం దూరంగా ఉండాలి. వీరికి దూరంగా ఉండకపోతే నష్టం ఎక్కువే ఉంటుంది.
ఇదే సమయంలో కొందరు అవమానానికి గురై, కష్టాన్ని తట్టుకునే వారితో జాగ్రత్తగా ఉండాలి. వారు దీర్ఘంగా ఆలోచించి భవిష్యత్ లో ప్రత్యర్థులపై కసి తీర్చుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరు తాత్కాలికంగా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోయినా భవిష్యత్ లో ప్రమాదంగానే ఉంటుంది. అందువల్ల మీ దగ్గరి బంధువులు, ఇంట్లోవాళ్లకు షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటే వారిని దూరం చేసుకోకండి. వారికి అనుగుణంగా ఉంటూ వారి మనసును