Better Life: మంచి జీవితం కావాలని కోరుకోని వారు ఉండరు. అసలు మంచి జీవితం అంటే ఏమిటి? మంచి జీవితం ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాలను ఆలోచించడం మానేసి సొంత ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆరాటపడే వారే ఉంటారు. మంచి జీవితం అంటే సమాజంలో గుర్తింపు రావడం.. జీవితానికి కావాల్సిన డబ్బు ఉండడం.. మానసికంగా సంతృప్తి చెందడం.. మరి ఈ మూడు ఒకేసారి ఎప్పుడు వస్తాయి? ఇవి వచ్చేవరకు ఎలాంటి కష్టాలు పడాలి? ఇవి వచ్చేవరకు ఏం చేయాలి?
ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. కానీ ఈ డబ్బును పొందడానికి కొందరు సక్రమ మార్గంలో వెళితే.. మరికొందరు మిగతా వారి కంటే తొందరగా డబ్బు సంపాదించాలన్న ఆరాటంతో వక్రమార్గంలో వెళ్తూ ఉంటారు. కానీ తాత్కాలికంగా వీరు డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఇది శాశ్వతంగా నిలిచి ఉండదు. అందువల్ల కాస్త టైం తీసుకున్నా.. సక్రమ మార్గంలోనే డబ్బు సంపాదించే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల డబ్బు శాశ్వతంగా ఉండి మంచి జీవితాన్ని పొందవచ్చు.
Also Read: కూలీ, వార్ 2 చూసేవాళ్ళకి రాజమౌళి సర్ ప్రైజ్?
కొందరు చెబుతున్న ప్రకారం మంచి పనులు చేసుకుంటూ పోతే గుర్తింపు దానంతట అదే వస్తుంది అని అంటారు. అయితే గుర్తింపు రావడం కూడా ఆశామాసి కాదు. చెడు గుర్తింపు రావడానికి ఒక్క తప్పు చేస్తే చాలు. కానీ మంచి గుర్తింపు రావడానికి 100 పనులు చేయాలి. అయితే ఈ గుర్తింపు రావడానికి ఎన్నో రకాల అవమానాలను పొందవలసి ఉంటుంది. కొందరు ఈ సమయంలో అవమానిస్తూ ఉంటారు.. మరికొందరు హేళన చేస్తూ ఉంటారు.. కానీ చేసే పని చేసుకుంటూ పోతే చివరకు విజయం సాధించడం మాత్రం తప్పదు అని అనుకోవాలి.. ఇలా ఒక్కసారి గుర్తింపు పొందితే అప్పుడు జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది..
కొందరు ఎంత డబ్బు సంపాదించినా.. సమాజంలో ఎంత గుర్తింపు ఉన్నా.. మానసికంగా తృప్తిగా ఉండలేరు. మానసికంగా తృప్తిగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. కుటుంబంతో కలిసి మెలిసి ఉంటాడు. ఎలాంటి తప్పుడు పనులు చేయరు. అందువల్ల మానసికంగా దృఢంగా ఉండడానికి కొన్ని విషయాలను వదులుకోవాలి. ఉదాహరణకు కావలసిన డబ్బును సంపాదించిన తర్వాత.. వాటి వినియోగంపై దృష్టి పెట్టాలి. అంతేకానీ అంతకంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలి.. స్థాయికి మించిన పనులు చేయాలి
.. అన్న ఆలోచనలను దూరం చేసుకోవాలి. అప్పుడే మానసికంగా తృప్తిగా ఉంటారు.
ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో మూడు విషయాల్లో ప్రణాళిక బద్దంగా ఉంటే మంచి జీవితం రావడం పెద్ద విషయం ఏమీ కాదు అని తెలుస్తుంది. అయితే వీటిని పొందడానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. కొందరికి పుట్టుకతోనే డబ్బు ఉంటుంది.. మరికొందరు డబ్బు కోసం జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. ఇక సమాజంలో గుర్తింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా సాధ్యం కాదు. అయితే ఒకసారి గుర్తింపు వస్తే దానిని చెరిగిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అప్పుడే అందమైన జీవితం కొనసాగుతూ ఉంటుంది.