New House: ఉద్యోగం.. వ్యాపారం.. ఏది చేసినా చివరకు ప్రశాంతంగా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం సొంత ఇంట్లోనే ఉంటుందని చాలా మంది భావన. ఆ సొంత ఇంటి కోసం జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. కొందరైతే జీవితంలో సగం డబ్బును సొంత ఇంటి కోసమే ఉపయోగిస్తారు. అయితే నేటి కాలంలో 25 ఏళ్లు వచ్చేసరికి ఉద్యోగం పొందేవారు ఉన్నారు. మీరు ఫస్ట్ తీసుకునే నిర్ణయం సొంత ఇల్లు కొనుక్కోవడం.. దానికి ఈఎంఐ ఏర్పాటు చేసుకోవడం. అయితే జాబ్ సెక్యూరిటీగా ఉండి ఇలా ఈఎంఐ ద్వారా ఇల్లు కొనుక్కోవడం బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా జాబ్ లేకపోతే.. దురదృష్టవశాత్తు ఉద్యోగం ఊడిపోతే.. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలాంటి సందర్భంలో కొందరి మనసుల్లో అనేక ఆలోచనలు. సొంత ఇల్లు కొనుక్కోవాలా? లేదా ఉన్న డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఇంతకీ ఈ రెండింటిలో ఏది బెటర్?
Also Read: కూలీ, వార్ 2 చూసేవాళ్ళకి రాజమౌళి సర్ ప్రైజ్?
ఈ ప్రశ్న ఇప్పటికే చాలామంది మదిలో మెదిలే ఉంటుంది. కానీ పరిష్కారం కొందరికే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆలోచన అనేది అదుపులో ఉండదు. పక్క వారు ఇల్లు కొనుక్కుంటే వారిని చూసి మనం కూడా కొత్త ఇంట్లో ఉండాలని అనుకునేవారు ఉన్నారు. ఇంకొందరు అర్ధ ఇంట్లో ఉండడం కంటే సొంత ఇంట్లోనే ప్రశాంతంగా ఉండొచ్చని భావించేవారు ఉన్నారు.
పక్కవాళ్ళను చూసి.. ప్రశాంతతను కోరుకునే విషయం పక్కన పెడితే.. అసలు ఇల్లు ఎలా కొనాలి? అనే ప్రశ్నపై ఎక్కువగా ఆలోచించాలి. నేటి కాలంలో ఎక్కువమంది కాస్త డబ్బు ఉండగానే మిగతాది బ్యాంకు రుణం తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం 10% చేతిలో నగదు ఉంచుకొని 90 శాతం రుణం తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల సొంత ఇంట్లో ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ ఈఎంఐ కట్టేటప్పుడు మాత్రం ఆ ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా సెక్యూరిటీ లేని జాబ్ చేసే వాళ్లకు ఈ ఈఎంఐ ఎప్పటికైనా మెడ మీద కత్తిలాగే ఉంటుంది. జాబ్ ఉన్నా.. లేకున్నా.. ఈఎంఐ చెల్లించే ఆదాయం ఉన్నవారికి పర్వాలేదు. కానీ ఉద్యోగంపై ఆధారపడి ఈఎంఐ చెల్లించేవారు మాత్రం ఆందోళన పడాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఇలాంటి అప్పుడు ఏం చేయాలి ? సమాజంలో అందరివి ఒకే పరిస్థితులు ఉండవు. ముందుగా మీ పరిస్థితి ఏంటి? అనేది అంచనా వేసుకోవాలి. చేతిలో కనీసం 50% నగదు ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు కొనేందుకు ముందడుగు వేయాలి. ఎందుకంటే ఏ క్షణంలో జాబ్ ఉంటుందో? ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి? ఒకవేళ ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత జాబ్ కనుక లేకపోతే తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక ప్రశాంతత గురించి ఆలోచిస్తే.. అప్పులు చేసి సొంత ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ చెల్లించలేక బాధపడడం కంటే.. అద్దె ఇంట్లోనే ఉన్న డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ చేసి.. కొనసాగడం బెటర్ అని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని రోజులపాటు డబ్బులు జమ చేసి ఆ తర్వాత ఇల్లు గురించి ఆలోచించడం మంచిదని చెబుతున్నారు.