Today 12 August 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఈరోజు వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం కలగనుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అయినా కూడా లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతున్నా.. ఖర్చులు ఉంటాయి. అయితే దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపారాలు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు. ఈ సమయంలో పెద్దలతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి. ఉద్యోగులకు అదనపు ఆదాయం రావడానికి అనేక మార్గాలు ఏర్పడతాయి. ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఉద్యోగులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధువుల నుంచి అందే ఓ సమాచారంతో నిరాశ చెందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . . ఈ రాశి వారు ఈ రోజు ఒక అద్భుతమైన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగుల పనితీరుతో అధికారులు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఆదాయ వనరులు పెరుగుతాయి. దీంతో గతంలో కంటే ప్రస్తుతం ఆదాయ స్థిరత్వాన్ని పొందుతారు. చట్టపరమైన చిక్కులు ఉంటే వెంటనే తొలగిపోతాయి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అయితే తోటి వారితో సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులు కొత్తగా పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆదాయం రావడానికి మార్గాలు ఏర్పడతాయి. అయితే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఆర్థికపరమైన మెరుగైన ఫలితాలు పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. ప్రియమైన వారితో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అనుకోకుండా డబ్బు ఇతరుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి తీర్థక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు అవసరమైన ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులు సాధారణ లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారుల ఆదాయానికి పురోగతి లభిస్తుంది. విదేశాల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల తో గొడవ జరిగితే మౌనంగా ఉండడమే మంచిది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పెద్దలతో జాగ్రత్తగా మాట్లాడాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనట్లయితే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . అవసరానికి డబ్బు అందుతుంది. నీతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఉద్యోగులు కాస్త ఇబ్బందులు పడతారు. పెండింగ్లో ఉన్న పనులపై దృష్టి పెట్టాలి. వ్యాపారులు తమ శక్తి సామర్ధ్యాల మేరకు కృషి చేస్తారు. దీంతో ఫలితాలు ఉండే అవకాశం ఉంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారి ఈరోజు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు వస్తాయి
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేసే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. ఇంట్లో కొన్ని పనుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రణాళికలు చేపడతారు. ప్రతికూల ఆలోచనలు నియంత్రించుకోవాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు స్నేహితులతో సరదాగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి డిన్నర్ కు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. పిల్లల చదువుపై కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.