Look : ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని కోరుకుంటారు. అందమైన చర్మాన్ని, ఫేస్ ను వద్దని ఎవరు అయినా అనుకుంటారా? కానీ అందరికీ ఇది సాధ్యం కాదు కదా. అందుకే ఖరీదైన ప్రాడక్ట్స్ వాడుతుంటారు. కొందరు నాచురల్ ప్రాడక్స్ట్ కొందరు కృత్రిమ ప్రాడక్ట్స్ వాడుతుంటారు. మరికొందరు అమ్మాయిలు లైట్ తీసుకుంటారు. అయితే మీ ఫేస్ ను అందంగా ఎప్పటికీ యవ్వనంగా ఉంచుకోవాలి అనుకుంటున్నారా?
అమ్మాయిలు తమ చర్మ సంరక్షణపై మరింత ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు కదా. అయితే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదండోయ్. కానీ కొన్ని చిన్న విషయాలపై దృష్టి పెట్టడం మాత్రం అవసరం. ఆరోగ్యం బాగుంటే చర్మం స్వయం చాలకంగా మచ్చలేనిదిగా ఉంటుంది. కాబట్టి సమతుల్య ఆహారం చర్మ సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. వయస్సు పెరుగుతున్నప్పటికీ ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. దీనితో పాటు, చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యం. కేవలం మీరు ఓ మూడు పనులు చేయడం ద్వారా, పెద్దయ్యాక కూడా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, యవ్వనంగా కనిపించవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటంటే?
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, వయస్సు పెరుగుతున్న ప్రభావం అందరి ముఖంలో కనిపిస్తుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి, అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి, ప్రజలు ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. కానీ కొన్ని నియమాలను ముందుగానే పాటిస్తే, ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత కూడా ముఖంపై వృద్ధాప్య సంకేతాలు కనిపించవు.
మొదటి పని ఇది
మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, దానిని దెబ్బతినకుండా కాపాడుకోవాలనుకుంటే ఓ చిన్న జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీరు ఉదయం నిద్రలేచి ముఖం కడుక్కున్నప్పుడు లేదా స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు, ముందుగా SPF 50 లేదా 30 ఉన్న క్రీమ్‌ను అప్లై చేయాలి. ఇది మీ రోజువారీ దినచర్యలో భాగం కావాలి. సూర్యకాంతికి చర్మం అంతర్గతంగా దెబ్బతింటుంది. వృద్ధాప్య సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి.
రెండవది:
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి, రోజువారీ చర్మ సంరక్షణ అవసరం. ప్రతి రాత్రి ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత రెటినోల్‌ను అప్లే చేయాలి. కళ్ళ కింద క్రీమ్ రాసుకుని నిద్రపోండి. ఇది మీరు పెద్దయ్యాక కూడా మీ చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. 30 ఏళ్లు దాటిన వారు రెటినోల్ వాడాలి. లేదా వారి లక్షణాల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాలి.
మూడవది:
మీరు పెద్దయ్యాక కూడా యవ్వనంగా ఉండాలని, యవ్వనంగా కనిపించాలనుకుంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ కండరాలు, ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా, మీకు లోపల నుంచి యవ్వనత్వాన్ని అందిస్తుంది. దాని ప్రభావం మీ ముఖంపై కూడా కనిపిస్తుంది. మీరు పెద్దయ్యాక కూడా ఈ మూడు విషయాలు మిమ్మల్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.