
Eyes : ప్రస్తుత కాలంలో కంటి జబ్బులు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే అద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. గతంలో అయితే వృద్ధులే కళ్లజోడు పెట్టుకునే వారు. చిన్న, యువత అసలు వాడేవారు కాదు. కానీ మారుతున్న పరిస్థితుల్లో కంటి జబ్బులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంటి చూపు సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికి కారణం మన ఆహార అలవాట్లే. పూర్వం మందులు వేయని వస్తువులు కావడంతో వారికి ఎలాంటి రోగాలు ఉండేవి కావు. నూరేళ్లు కంటి సమస్యలు లేకుండా జీవించేవారు. కానీ ఇప్పుడు మాత్రం పదేళ్లకు కూడా కళ్లజోడు పెట్టుకోవడం విచిత్రంగానే అనిపిస్తుంది.
కంటి జబ్బులు ఎందుకు వస్తున్నాయి
చిన్న వయసులోనే కంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఆహారం తీసుకోకపోవడమే. అందరు ఫిజాలు, బర్గర్లకు అలవాటు పడుతున్నారు. అందులో ఉండే ఉప్పు, కారం, నూనె, మైదా లాంటి పదార్థాలు మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా మనకు చిన్న వయసులోనే కంటి జబ్బులు కలవరపెడుతున్నాయి. కళ్లద్దాలు పెట్టుకుని పనిచేయాల్సి వస్తోంది. దీంతో మనం ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించడం లేదు. మన ఆహార అలవాట్లే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. అయినా ఎవరు లక్కచేయడం లేదు.

మునగాకు
కళ్ల జబ్బులు రాకుండా ఉండాలంటే మునగాకు దివ్య ఔషధంగ ఉపయోగపడుతుంది. మునగాకును మనం పప్పు చేసుకున్నప్పుడల్లా అందులో గుప్పెడు వేసుకుని తింటే కళ్లకు సంబంధించిన జబ్బులు రావు. ఇంకా మునగాకు పచ్చడి కూడా చేసుకోవచ్చు. దీంతో మన కడుపులోకి ఎలాగైనా దాన్ని తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మన శరీరం రోగాలకు గురి కాకుండా ఉండాలంటే మునగాకును ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మిరియాలతో మందు
ఐదు మిరియాలను తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక సగం టీ స్పూన్ పటిక బెల్లం పొడిని కలిపి కలుపుకోవాలి. అందులో ఆవునెయ్యి ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. దీన్ని ప్రతిరోజు పరిగడుపున తీసుకోవాలి. ఈ మిశ్రమం తీసుకున్న తరువాత ఓ గంట వరకు ఎలాంటి ఇతర పదార్థాలు తీసుకోవద్దు. పొగ తాగడం అలవాటు ఉంటే మానేయాలి. రోజు ముప్పావు స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల కంటి జబ్బులు రాకుండా పోతాయి. ఇది మూడు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు.