Jonna Rotte: చలికాలంలో జొన్నరొట్టెను తింటున్నారా?

ఇటీవల కాలంలో మధుమేహం బారిన పడిన వారికి వైద్యులు జొన్నరొట్టె తినాలని చెబుతున్నారు. దీంతో పట్టణాల్లో రోడ్డు పక్కన చాలా మంది వేడి వేడి జొన్నరొట్టెను తయారు చేసి ఇస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : January 6, 2024 3:16 pm

Jonna Rotte

Follow us on

Jonna Rotte: వాతావరణం పొల్యూషన్ కారణంగా నేటి కాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి. టేస్టీ ఫుడ్ కావాలంటూ చాలా మంది రోడ్ సైడ్ ఉండే బండ్లపై… రెస్టారెంట్లలో లభించే పదార్థాలపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అయితే రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం అంత మంచిదికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు వీటి రుచికి అలవాటుపడితే ఇంట్లో ఫుడ్ తీసుకోకుండా ఉంటారని అంటున్నారు. అందువల్ల నేచురల్ ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇటీవల కాలంలో మధుమేహం బారిన పడిన వారికి వైద్యులు జొన్నరొట్టె తినాలని చెబుతున్నారు. దీంతో పట్టణాల్లో రోడ్డు పక్కన చాలా మంది వేడి వేడి జొన్నరొట్టెను తయారు చేసి ఇస్తున్నారు.కాస్త ఓపిక ఉంటే ఇంట్లో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. అయితే చలికాంలో జొన్నరొట్టే తినొచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది వాతావరణంలో అనేక మార్పులు సంభవించినందున విపరీతమైన చలి ఉంది. దీంతో చాలా మంది కాస్త చీకటి పడగానే ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆహారపు అలవాట్లు పాటించాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం జీర్ణం కాని ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే సాధారణ కాలంలో కంటే ఈ సమయంలో ఫుడ్ డైజేషన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడానికి అలవాటు పడాలి. అయితే లైట్ ఫుడ్ లో కూడా ఎక్కువ పోషకాలు ఉండేవి అయితే మరీ నయం. అందుకోసం నేచురల్ ఫుడ్ పై ఆధారపడాలి.

ఈమధ్య జొన్నరొట్టెకు డిమాండ్ పెరుగుతోంది. వ్యాధిగ్రస్తులు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులు సైతం ముందు జాగ్రత్తగా జొన్నరొట్టెను రెగ్యులర్ ఫుడ్ గా తీసుకుంటున్నారు. ఒకప్పుడు నార్త్ లో మాత్రమే జొన్నరొట్టే కనిపించేది. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసినా వేడి వేడి జొన్నరొట్టెను తయారు చేసి ఇస్తున్నారు. జొన్న రొట్టెలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం తో పాటు జిక్ అధికంగా లభిస్తుంది. ఇందులో విటమిన్ బి3 ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి జొన్నరొట్టే చాలా వరకు ఉపయోగపడుతుంది.

అయితే జొన్నరొట్టెను చలికాలంలో తినొచ్చా? అనే సందేహం చాలా మందికి ఉంది. చలికాలంలో జొన్నరొట్టె తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే జొన్న రొట్టెతినగానే కడుపు నిండినట్లు అవుతుంది. దీంతో మిగతా ఆహారం జోలికి వెళ్లలేము.అలాగే ఇందులో ఉండే పోషకాలతో తక్కువ ఆహారంతో ఎక్కువ ఎనర్జీ వచ్చినట్లు అవుతుంది. శీతాకాలంలో ఫుడ్ డైజేషన్ సమస్యలు ఉన్నవారు జొన్నరొట్టెను రెగ్యులర్ గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.