Food Wrapped In Newspapers: మనం రోజు రోడ్డుపక్కన దొరికే ఆహార పదార్థాలను తింటూ ఉంటాం. వాటిని ప్యాకింగ్ చేయించుకుని ఇంటికి కూడా తీసుకెళ్తాం. పేపర్ లో పెట్టిన ఆహార పదార్థాలతో మనకు నష్టాలే కలగనున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. వార్తా పత్రికలలో పెట్టిన ఆహారంతో మనకు అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వార్తా పత్రికలలో చుట్టిన ఆహారంతో ముప్పే వాటిల్లనుంది. రోడ్డు పక్కన దొరికే ఆహార పదార్థాల కోసం చాలా మంది ఎగబడుతుంటారు. పేపర్ లో పెట్టిన పదార్థాలతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు.

వార్తాపత్రికల్లో వాడే సిరా మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. పేపర్ లో కట్టిన తినుబండారాలు వేడిగా ఉండటంతో ఆ పేపర్ కు ఉన్న సిరా పదార్థాలకు అంటుకుని అది మన శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. ఫలితంగా మనకు శ్వాస పరమైన ఇబ్బందులు వస్తాయి. దీన్ని ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ కూడా హెచ్చరించింది. పేపర్లలో తీసుకునే పదార్థాలతో మనకు ముప్పు పొంచి ఉందని చెబుతున్నాయి. కానీ ఎవరు కూడా వినిపించుకోవడం లేదు. పేపర్ లో చుట్టిన ఆహార పదార్థాల వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి.
వార్తాపత్రికల్లో వాడే సిరాతో వేడి ఆహారం కలిస్తే అది శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తోంది. దీంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఊపిరితిత్తులలోని ట్రోన్కియోల్స్ లేదా అల్వియోలీ కణాలకు వ్యాపిస్తుంది. ఊపిరితిత్తుల పలుచని పొరలో క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది. మెల్లా శ్వాస సమస్యలు వస్తాయి. పేపర్ లో చుట్టిన ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే వీలుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీంతో కంటి చూపు కూడా మందగించే ప్రమాదం ఉంది. ప్రతి రోజు వార్తా పత్రికల్లో చుట్టిన ఆహారం తీసుకుంటే కంటి చూపు ను ప్రభావితం చేస్తుంది. ఇందులో ఉండే ఇంకుతోనే మనకు ప్రమాదాలు వస్తాయనడంలో సందేహం లేదు. అందుకే వార్తా పత్రికల్లో చుట్టిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి. రోగాల ముప్పును తెచ్చుకోవద్దు. చిన్నపిల్లలకైతే ఇంకా ఇబ్బందే. చాలా మంది రోడ్ల పక్కన బజ్జీల కొట్లలో ఇష్టంగా పేపర్ లో చుట్టిన వాటినే తింటుంటారు. కానీ ఇకపై జాగ్రత్త సుమా. రోడ్డ పక్కన అమ్మే వాటిని తీసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు.

వార్తాపత్రికల్లో వాడే ఇంకుతో కాలేయం కూడా దెబ్బ తింటుంది. దీనివల్ల కాలేయ క్యాన్సర్ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి గ్యాస్ సమస్యలు వేధిస్తాయి. మూత్రాశయ క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. ఇన్ని రోగాలకు కారణమైన పేపర్లలో తీసుకునే ఆహారాన్ని దూరం పెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను అందరు జాగ్రత్తగా ఉంటూ రోడ్ల పక్కన అమ్మే ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకోవాలి.